SIIMA 2023: దుబాయ్ లో రాణా, మృణాల్ ఠాకూర్

SIIMA 2023: దుబాయ్ లో రాణా, మృణాల్ ఠాకూర్
సెప్టెంబర్ 15,16 తేదీల్లో కార్యక్రమం జరుగనుంది.

దక్షణ భారతదేశం నుంచి సినీ రంగంలో ప్రకటించే అవార్డులలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)కు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు, కన్నడ, తమిళం, మళయాల బాషలలో ఉత్తమమైన సినిమాలకు అవార్డులను సైమా ప్రధానం చేస్తుంది. 2023గాను దుబాయ్ లో అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించనున్నారు. ఈ సారి సైమాతో కలిసి నెక్సా భాగస్వామ్యం కానుంది. రెండు సంస్థల పార్ట్ నర్ షిప్ కార్యక్రమానికి అథితులుగా టాలీవుడ్ యాక్టర్ రాణా దగ్గుబాటి, నటి మృణాల్ ఠాకూర్ హాజరయ్యారు. సైమా 11వ ఎడిషన్ నామినేషన్లు తొందరలోనే వెలువడనున్నాయి. సెప్టెంబర్ 15,16 తేదీల్లో కార్యక్రమం జరుగనుంది.




ప్రపంచ వేదికపై దక్షిణ భారత చలనచిత్రాల అవార్డుల కార్యక్రమం జరుగనుందని అన్నారు సైమా ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్. ఇందుకు తాము మళ్లీ దుబాయ్ కు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. UAE లో అవార్డుల కార్యక్రమం ఎల్లప్పుడూ సంతోషించేదేనని. సౌత్ ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న తరుణం తొందరలోనే రాబోతుందని చెప్పారు.

మీడియాతో మాట్లాడిన రాణా... 2023 సైమా అవార్డులలో తాను భాగం కావడం సంతోషమన్నాడు. సౌత్ ఫిల్మ్ మొత్తాన్ని ఒకే చోట చేర్చినందుకు సైమాకు అభినందనలు తెలిపాడు. ఇది ఒక అద్భుతమైన అనుభూతని చెప్పాడు.
నటి మృణాల్ మాట్లాడుతూ... సీతారామంతో సౌత్ ఫిల్స్ లో భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపింది. దక్షిణ భారతం నుంచి తనకు ఎంతో ప్రేమ లభించిందని చెప్పింది. వచ్చే నెలలో UAEలో జరిగే సైమా అవార్డుల ప్రధానోత్సవంకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.




సెప్టెంబరు 15,16వ తేదీల్లో దుబాయ్‌లోని DWTCలో రెండు రోజుల కోలాహలం జరుగనుంది. ఈ కార్యక్రమంలో సంగీతం, నృత్యం, హాస్యంతో కలగలిపిన సంపూర్ణ వినోదంతో కూడిన గొప్ప ఉత్సవం జరుగనుంది. దక్షిణ భారత సినిమాలోని అత్యుత్తమ ప్రతిభావంతులు ఒకచోట చేరనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story