గాన గంధర్వుడుకి కన్నీటి వీడ్కోలు

గాన గంధర్వుడుకి కన్నీటి వీడ్కోలు
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ముగిశాయి. ఐదు దశాబ్ధాల పాటు తన గానామృతంతో సంగీత ప్రేక్షకులను ఓలలాడించిన పాటల మాంత్రికుడికి..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ముగిశాయి. ఐదు దశాబ్ధాల పాటు తన గానామృతంతో సంగీత ప్రేక్షకులను ఓలలాడించిన పాటల మాంత్రికుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు మధ్య అంత్యక్రియలు జరిగాయి. చెన్నైలోని తామరైపాక్కం వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు చెప్పారు. సంప్రదాయం ప్రకారం తనయుడు చరణ్‌ - అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వీరశైవ జంగమ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు బంధువులు.

అంతిమ సంస్కారానికి కుంటుంబ సభ్యులు, కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా అభిమానులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు తిరువళ్లూరు పోలీసులు. ఆంక్షలు ఉన్నా తమ అభిమాన స్వరమాంత్రికుడికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు అభిమానులు భారీగానే హాజరయ్యారు. ఇక సెలవంటూ బాలుకి సంగీత ప్రియులు, అభిమానులు తుది వీడ్కోలు చెప్పారు. అంత్యక్రియల కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు హాజరుయ్యారు. సింగర్‌ మను, నటుడు అర్జున్, తమిళ హీరో అగ్రహీరో విజయ్‌.. బాటు అంత్యక్రియాల్లో పాల్గొన్నారు.

బాలు లాంటి గానగంధర్వుడిని మళ్లీ చూస్తామా అంటూ స్మరించుకున్నారు సంగీత అభిమానులు. ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూతతో సినీపరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఐదున్నర దశాబ్దాల పాటు అద్భుతమైన గాత్రంతో అలరించిన గాన గాంధర్వుడు తిరిగి రాలని లోకాలకు వెళ్లిపోయారని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు..నివాళులు అర్పించారు. గన గంధర్వుడికి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. భౌతికంగా మీరు తమ మధ్య లేకపోయినా.. మీరు పాడిన పాటల పూతోటలు తమను అలరిస్తూనే ఉంటాయని స్మరించుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story