సినిమా

నిలకడగా ఎస్పీబాలు ఆరోగ్యం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. సోమవారం ఆయనకు కరోనా పరీక్షల్లో నెగిటివ్

నిలకడగా ఎస్పీబాలు ఆరోగ్యం
X

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. సోమవారం ఆయనకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇన్నాళ్లు అనారోగ్యంగా ఉండటంతో ఆయన బాగా నీరసించిపోయారు. దీంతో, ఆయనకు మరిన్ని రోజులు చికిత్స అందించాల్సి ఉందని తెలిపారు. అయితే, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. త్వరలోనే ఆయనకు వెంటిలేటర్‌ తీసేయాలని వైద్యులు భావిస్తున్న‌ట్లు ఎస్పీ బాలు త‌న‌యుడు చ‌ర‌ణ్ చెప్పారు. కాగా.. ఎస్పీ బాలు కరోనా బారినపడటంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజులకు ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకీ తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా స్పృహలోనే ఉన్నారని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఊపిరితిత్తుల ప‌నితీరు కూడా మెరుగుపడినట్లు తెలిపారు.

Next Story

RELATED STORIES