The Paradise : నాని ప్యారడైజ్ మేకింగ్ వీడియో

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో దసరా తర్వాత రూపొందుతోన్న మూవీ ‘ద ప్యారడైజ్’. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఊరమాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ముందు నుంచీ చెబుతున్నారు. హైదరాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని ఓ బస్తీ నేపథ్యంలో సాగే కథ అని చెప్పారు. రీసెంట్ గా నాని ఈ మూవీ జడల్ అనే పాత్ర చేస్తున్నాడని అతని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. తాజాగా ‘స్పార్క్ ఆఫ్ ద ప్యారడైజ్’ అంటూ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో చూస్తే సినిమాలో నాని పాత్ర ఎంత అగ్రెసివ్ గా ఉండబోతోందో అర్థం అవుతుంది. అలాగే జైలు సెటప్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఓ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అవుతుందనేలా ఈ మేకింగ్ లో వీడియాలో ఆ ఎపిసోడ్ ను చూపించారు.
ఆ జైలులో వచ్చే ఓ ఫైట్ సీన్ చిత్రీకరణకు సంబంధించిన వీడియో ఇది. ఆ సందర్భంగా వచ్చే సీన్స్ ను దర్శకుడు ఎక్స్ ప్లెయిన్ చేస్తుండగా కెమెరా క్యాప్చర్ చేస్తూ వెళుతోంది. జడల్ తన బ్యారక్ లో పుషప్స్ చేస్తున్నప్పుడు కొంతమంది గుంపుగా వెళ్లి అక్కడ రచ్చ రచ్చ చేయడం అనే పోర్షన్ ను కెమెరామేన్ కు ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నాడు శ్రీకాంత్. అలాగే వాడి జడల్ ని ముట్టుకుని వాడికి సర్రుమని కోపం వస్తుందని చెప్పడం ఈ వీడియోలో ఉంది. చూస్తుంటే నాని ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేలానే ఉన్నాడు. ఇప్పటి వరకూ చేసిన.. దసరాకు మించిన ఊరమాస్ గెటప్, క్యారెక్టర్ ఈ సినిమాలో కనిపిస్తాయని మాత్రం అర్థం అవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com