Happy Birthday Charmy Kaur : టీనేజ్ లోనే వెండితెర పై హవా

Happy Birthday Charmy Kaur : టీనేజ్ లోనే వెండితెర పై హవా
Charmy Kaur : టీనేజ్ లోనే వెండితెర ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఛార్మీ. అంత చిన్న వయసులోనే నీ తోడు కావాలి అంటూ సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది.

Charmy Kaur : టీనేజ్ లోనే వెండితెర ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఛార్మీ. అంత చిన్న వయసులోనే నీ తోడు కావాలి అంటూ సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. గుర్తింపు రావడానికి కొంత గ్యాప్ పట్టినా.. తర్వాత తనదైన శైలిలో వెండితెరపై చెలరేగిపోయింది. కొన్నాళ్ల పాటు హవా చేసి ఛార్మీ ప్రస్తుతం వెండితెర వెనక కెరీర్ చూసుకుంటోంది. పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటోన్న ఛార్మీ పుట్టిన రోజు ఇవాళ.

చాలామంది సినిమావాళ్లు కామన్ గా చెప్పే డైలాగ్.. అసలు మేం ఆర్టిస్టులం కావాలనుకోలేదు అని.. ఇది ఛార్మీకీ వర్తిస్తుంది. 14యేళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ సినిమా వ్యక్తి ఆమెను ఢిల్లీలో చూసి హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని ఆమె పేరెంట్స్ ను ఒప్పించాడు. అతనే తెలుగులో ఛార్మీని నీ తోడు కావాలి సినిమాతో పరిచయమయ్యేలా చేశాడు. అప్పటికి ఛార్మీ ఇంకా స్కూలింగ్ లో ఉండటం వల్ల కేవలం హాలిడేస్ లో మాత్రమే షూటింగ్ జరిపేలా కండీషన్స్ పెట్టి ఛార్మీని సినిమా నటిని చేశారు ఆమె పేరెంట్స్..

కొందరు దర్శకుల చేతిలో పడితే హీరోలు నటనలో మెరుగవుతారు.. హీరోయిన్లు అందంలో మెరుగవుతారు. అలాంటి దర్శకుడే కృష్ణవంశీ. తెలుగులో ఛార్మీ చేసిన సినిమాలు చూసిన కృష్ణవంశీ.. తన శ్రీ ఆంజనేయం సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. మరి అలాంటి దర్శకుడు అవకాశం ఇస్తే ఉపయోగించుకోనిది ఎవరు.. అందుకే ఛార్మీ కూడా ఒళ్లు దాచుకోకుండా కష్టపడి.. తన అసలు టాలెంట్ ఏంటో ఆడియన్స్ కు అర్థమయ్యేలా చేసింది.. అంతే.. శ్రీ ఆంజనేయం దెబ్బకు ఛార్మీకి ఫిదా అయింది టాలీవుడ్.

కెరీర్ పరంగా ఛార్మీకి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా మంత్ర. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో ఛార్మీ నటనను చూసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు. లైఫ్ లో ఒక్కసారైనా అలాంటి పాత్ర చేయాలని ఇతర హీరోయిన్లూ కలలు కన్నారు. అంతలా ఈ పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది.. అలాగే తన నటనకు తొలి నందిని కూడా అందుకుంది ఛార్మీ. అయితే తనకు ఎంతో పేరు తెచ్చిన మంత్ర సినిమానే తర్వాత తన కెరీర్ కు మంగళం పాడిందంటే అతిశయోక్తి కాదు. చేస్తున్న సినిమాలు యావరేజ్ అవుతున్నాయి.. స్టార్ హీరోలతో ఛాన్సులు తగ్గాయి. దీంతో మళ్లీ తనదైన శైలిలో మనోరమ, కావ్యాస్ డైరీ, 16డేస్ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీ అయిపోయింది. కానీ ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. అదే టైమ్ లో మరోసారి మంత్ర దర్శకుడితో మంగళ అనే సినిమా చేసింది.. ఇది కాస్త యావరేజ్ అనిపించుకున్నా .. అప్పటికే నష్టం జరిగిపోయింది.

అసలే ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ తక్కువ. అలాంటప్పుడు కెరీర్ జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవాలి. అలా చేసుకోలేకపోతే.. ఛార్మీ లాగే టాలెంట్ ఉన్నా స్టార్డమ్ రాకుండా పోతుంది. అందుకే అవకాశాలు తగ్గిన టైమ్ లో ఐటమ్ సాంగ్స్ కూ ఓకే చెప్పింది ఛార్మీ. ఎలాగైనా సీన్ లో ఉండాలి అనుకోవడం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. బట్ ఛార్మీ లాంటి బ్యూటీ ఐటమ్ సాంగ్స్ చేస్తానంటే ఎవరు కాదంటారు.. వెంట వెంటనే అవకాశాలొచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story