Ram Charan : రామ్ చరణ్ మూవీస్ నుంచి రెండు కీలక అప్డేట్స్

Ram Charan :  రామ్ చరణ్ మూవీస్ నుంచి రెండు కీలక అప్డేట్స్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ యేడాది డిసెంబర్ 20న విడుదల కాబోతోందీ మూవీ. డేట్ లో మార్పులు ఉండే అవకాశం కూడా ఉందంటున్నారు. బట్ అదే డేట్ అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లియర్ గా చెప్పాడు.. కాబట్టి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోవచ్చు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అంజలి, సునిల్, ఎస్.జే సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు నిర్మాత, శంకర్ డైరెక్టర్. రామ్ చరణ్ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు అని ఎప్పుడో చెప్పారు. నేటి పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థల గురించి సినిమాలో డిస్కస్ చేసినట్టుగా అర్థం అవుతోంది. ఇక అప్డేట్ ఏంటీ.. అంటే.. ఈ మూవీ ప్రమోషన్స్ ను అక్టోబర్ నుంచే మొదలుపెట్టబోతున్నారట. అప్పటికి టీజర్ ను విడుదల చేస్తారట. దానికి ముందు మరో హుషారైన పాట కూడా విడుదల చేస్తే ప్రమోషన్స్ లో కిక్ కనిపిస్తుంది. రిలీజ్ కు చాలా రోజు ముందే ప్రమోషన్ ఎందుకు అంటే.. ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి.. చివర్లో హడావిడీగా చేసే కంటే ప్లాన్డ్ గా వెళ్లాలనుకుంటున్నారని టాక్.

ఇక సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తోన్న బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కాబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో చరణ్ ఓ స్పోర్ట్స్ మేన్ పాత్ర చేయబోతున్నాడని తెలుస్తోంది. సో.. నవంబర్ లో స్టార్ట్ అయితే పెద్ద గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేయాలనుకుంటున్నారట. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఉన్నా.. ఆ టైమ్ లో చరణ్ లేని సన్నివేశాలు చిత్రీకరించేలా ప్లాన్ చేశారట. అన్నీ కుదిరితే ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఆగస్ట్ 15కు ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. అదీ మేటర్.

Tags

Next Story