Devara NTR : దేవర మిడ్ నైట్ షోస్ పై స్పెషల్ అప్డేట్స్ .

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరపై క్రేజ్ అమాంతంగా పెరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం కొంత మైనస్ అవుతుందనుకున్నారు చాలామంది. బట్ ఈవెంట్ క్యాన్సిల్ అయినా.. అందుకోసం విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఫస్ట్ ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ కు చాలా బెటర్ గా ఉందనే టాక్ రావడంతో మళ్లీ అంచనాలు మొదలయ్యాయి. ఫ్యాన్స్ కొంత డిజప్పాయింట్ అయినా.. రిలీజ్ తర్వాత భారీ స్థాయిలో సక్సెస్ మీట్ పెట్టే అవకాశం లేకపోలేదు. ఇక ఈ మూవీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మిడ్ నైట్ షోకు పర్మిషన్ వచ్చింది. అలాగే అదనపు షోస్ ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. త్వరలోనే తెలంగాణలో కూడా పర్మిషన్ వచ్చేస్తుంది.
అయితే మిడ్ నైట్ షోస్ కు సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా ఓ కండీషన్ ఉంది. మాగ్జిమం థియేటర్స్ వాళ్లే సినిమాను ప్రదర్శించే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పటి వరకూ ఇలాంటి షోస్ ను థర్డ్ పార్టీ వాళ్లు థియేటర్స్ ను అద్దెకు తీసుకుని టికెట్ ధరలు భారీగా పెట్టి సినిమా ప్రదర్శించేవారు. అయితే ఈ సారి డిస్ట్రిబ్యూటర్సే షోస్ వేసే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఎప్పట్లానే అయినా.. సినిమాను ప్రదర్శించేందుకు ఒక టైమ్ పెట్టారు.
దేవర మిడ్ నైట్ షోను 1.08 నిమిషాలకు స్టార్ట్ చేయాలని అన్ని ఏరియాలకు ఇన్ఫర్మేషన్ వెళ్లింది. ఆ మేరకు ముహూర్తంకు తగ్గట్టుగానే ఆటలు ఉంటాయి. అయితే రెండు రాష్ట్రాల్లో కూడా కేవలం సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే ప్రదర్శనలుకు అనుమతి ఉంటుంది. మల్టీ ప్లెక్స్ ల్లో మిడ్ నైట్ షోస్ ఉండవు. ఇక టికెట్ ధరలను ఫిక్స్ డ్ గా చేయబోతున్నారట. రాత్రిపూట ఆటకు 1000 రూపాయల ధర నిర్ణయించే అవకాశం ఉందంటున్నారు. బెన్ ఫిట్ షోస్ టైమ్ లో డిమాండ్ ను బట్టి రెండు మూడు వేలు కొన్నిసార్లు ఐదు వేల వరకూ వసూలు చేసిన సందర్భాలున్నాయి. కాబట్టి ఈ వెయ్యిని ఫ్యాన్స్ పెద్ద సీరియస్ గా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ టైమ్ లో చూసేది వాళ్లే కదా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com