NTR - Neel : ఎన్టీఆర్ - నీల్ డ్రాగన్ లో నిజంగానే వాళ్లున్నారా

NTR - Neel :  ఎన్టీఆర్ - నీల్ డ్రాగన్ లో నిజంగానే వాళ్లున్నారా
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉందిప్పుడు. ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దేవరతో దాన్ని సోలోగా నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టి వార్ 2తో రాబోతున్నాడు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తోన్న వార్ 2లో అతను ఇండియన్ ఏజెంట్ గా నటిస్తున్నాడు అంటున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న వార్ 2 ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఈ సమ్మర్ లో మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్ అనిపించుకున్న ప్రశాంత్ నీల్ మూవీ ‘డ్రాగన్’షూటింగ్ లో జాయిన్ అవుతాడు యంగ్ టైగర్. ఆల్రెడీ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సాగుతూనే ఉంది.

సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతోంది. అయితే లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ఇద్దరు మళయాల టాలెంటెడ్ ఆర్టిస్టులున్నారు అనే వార్త చక్కర్లు కొడుతోంది. చాలా యేళ్ల క్రితం రణం అనే మూవీలో విలన్ గా నటించిన బిజు మీనన్ తో పాటు ఇప్పుడిప్పుడే హీరోగా స్టార్డమ్ తెచ్చుకుంటోన్న టోవినో థామస్ లు ఈ డ్రాగన్ లో కీలక పాత్రలు చేస్తున్నారు అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది. నటుడుగా బిజు మీనన్ సత్తా ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. స్టార్ గా టోవినో థామస్ ఉన్నా.. అంచనాలు పెరుగుతాయి. ఈ ఇద్దరూ మళయాలంలో మార్కెట్ క్రియేట్ చేస్తారు.

కానీ నిజంగా ఆ ఇద్దరూ డ్రాగన్ లో నటిస్తున్నారు అనే దానికి మూవీ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. కేవలం ఊహాగానాలుగానే ఉన్నాయి ఇప్పటి వరకు. ఏదైనా ఇలాంటి ఆర్టిస్టులు యాడ్ అవుతున్నప్పుడు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కాస్త డైల్యూట్ అవుతుందనేది అభిమానుల వాదన. అందుకే అసలు నిజాలేంటో చెబితే బెటర్ ఏమో..

Tags

Next Story