Sree Leela: 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల.. లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టేనా..!

Sree Leela (tv5news.in)
Sree Leela: ఈమధ్య హీరోయిన్స్ ఒక్క సినిమాతో అయినా.. కావాల్సినంత ఫేమ్‌ను సంపాదించుకుంటున్నారు. అలా తెలుగులో చేసింది ఒక్క చిత్రమే అయినా.. చాలామందికి క్రష్‌గా మారిపోయింది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఏ హీరోయిన్‌ను అయినా.. చాలా అందంగా చూపిస్తారు. అలా శ్రీలీల అందానికి, యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తాజాగా ఆర్‌ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల ప్రత్యక్షమయ్యింది. దీంతో రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ మార్చి 25న దేశవ్యాప్తంగా విడుదల అవుతుంది. అయితే ఈ సినిమాను ప్రతీ భాషా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని మూవీ టీమ్.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈవెంట్స్‌ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే శనివారం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఛీఫ్ గెస్ట్‌గా హాజరచయ్యారు. అయితే వారితో పాటు శ్రీలీల కూడా ఈవెంట్‌లో సందడి చేసింది.
ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీలను చూసేసరికి రాజమౌళి తరువాతి చిత్రంలో ఈ భామ ఛాన్స్ కొట్టేసినట్టు రూమర్స్ మొదలయ్యాయి. కానీ అందులో అసలు విషయం వేరే ఉంది. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేస్తున్న సంస్థ శ్రీలీల ఫ్యామిలీకి చాలా క్లోజ్ కావడంతో.. ఈవెంట్‌కు తనకు కూడా ఆహ్వనం అందిందట. అంతే కానీ రాజమౌళి సినిమాలో శ్రీలీల ఏం నటించట్లేదని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com