Sreeleela : ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాదండీ.. శ్రీలీల వస్తోంది.. ఆయ్

Sreeleela : ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాదండీ.. శ్రీలీల వస్తోంది.. ఆయ్
X

ఏ ఇండస్ట్రీలో అయినా ఇప్పుడు వారసులదే హవా. తండ్రుల నుంచి కొడుకులు, కొడుకుల నుంచి ఫ్రెండ్స్ అక్కడి నుంచి బావమరుదులు ఇలా ఎలా చూసినా అంతా వాళ్లే కనిపిస్తున్నారు. అయినా ఎక్కడో ఉంటూ ఇండస్ట్రీలో వెలిగిపోవాలని చాలామంది కలలు కంటుంటారు. అలాంటిది పరిశ్రమను దగ్గరగా చూస్తున్నవాళ్లు అలా ఫీలైతే తప్పేంటీ..? పైగా వీళ్లకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో పాటు ఆ ఫ్యామిలీస్ లోని స్టార్స్ అండ కూడా ఉంటుంది. అందుకే తాజాగా ఆయ్ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్, అల్లు అర్జున్ అటెండ్ అవుతారు అనే ప్రచారం జరిగింది. ఈ మూవీకి వాళ్లెందుకు వస్తారు అనుకుంటున్నారా..సింపుల్.. ఈ మూవీలో నటించిన హీరో నితిన్.. ఎన్టీఆర్ కు స్వయానా బావమరిది. తన భార్య తమ్ముడు. అందుకే ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తాడన్నారు. మరి అల్లు అర్జున్ ఏంటీ అంటే.. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది బన్నీ వాస్. అంచేత బన్నీ వాస్ కోసం బన్నీ వస్తాడు అన్నారు. బట్ ఈ రెండు వార్తలూ నిజం కాదని తేలిపోయింది.

ఆయ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ ఇద్దరు హీరోలు కాకుండా ప్రస్తుతం సినిమాల్లేక ఖాళీగా ఉంటోన్న శ్రీలీల చీఫ్ గెస్ట్ గా వస్తుండటం విశేషం. యస్ ఈ మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ కాబోతోన్న ఆయ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా శ్రీ లీల వస్తోంది. దీంతో ఎన్టీఆర్, అల్లు అర్జున్ వస్తారు అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. నిజానికి శ్రీ లీల.. అటు ఎన్టీఆర్ కానీ, ఇటు అల్లు అర్జున్ తో కానీ నటించలేదు. అయినా తనను పిలుస్తున్నారంటే కుర్రాళ్లంతా ఎగేసుకుని వస్తారనే కదండీ..

Tags

Next Story