Sree Leela : మూడో సినిమాకే కళ్ళు చెదిరే రెమ్యునరేషన్..!

Sree Leela : శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది శ్రీలీల.. ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడీ ఈ భామకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
ఇప్పటికే ఆమె మాస్ మహారాజా రవితేజ 'ధమకా' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యంగ్ హీరో నితిన్‌తో ఓ సినిమా కూడా చేస్తోంది ఈ బ్యూటీ. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ మధ్యే గ్రాండ్‌గా లాంచ్ అయింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి మరియు రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా కోసం శ్రీలీల భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తోంది. పెళ్లి సందడి సినిమాకి గాను రూ. 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు నితిన్ సినిమాకి ఏకంగా రూ. 1.25 కోట్లు డిమాండ్ చేసిందని, అందుకు నిర్మాతలు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. హారిస్ జయరాజ్ చాలా సంవత్సరాల తరవాత తెలుగులో మ్యూజిక్ చేస్తున్నారు. ఇది నితిన్ కి 32 వ చిత్రం కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com