Sree Vishnu : ‘ఐటమ్’లా మారుతోన్న శ్రీ విష్ణు

Sree Vishnu :  ‘ఐటమ్’లా మారుతోన్న శ్రీ విష్ణు
X

టాలీవుడ్ లో తన కేపబిలిటీకి తగ్గట్టుగా రాణిస్తోన్న హీరో శ్రీ విష్ణు. ఒకప్పుడు అన్నీ వైవిధ్యమైన కథలే చేశాడు. కొన్నాళ్లుగా మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటున్నాడు. కామెడీ ఉంటేనే ఆ కథలకు ఓకే చెబుతున్నాడు. దీంతో ఆడియన్స్ కు నవ్వులతో పాటు ప్రొడ్యూసర్స్ కు కాసులు కూడా వస్తున్నాయి. అందుకే ఈ జానర్ నే కంటిన్యూ చేస్తున్నాడు. చివరగా వచ్చిన ‘శ్వాగ్’బాగా నిరాశపరిచింది. అయినా ‘సింగిల్’గా సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు.

కార్తీక్ రాజు దర్శకత్వంలో ప్రస్తుతం ‘సింగిల్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ చూస్తే మరోసారి హిలేరియస్ గా నవ్వించబోతున్నాడా అనిపించింది. ఈ చిత్రంలో అతని సరసన కేతిక శర్మ, ఇవనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పట్లానే కామెడీలో మేజర్ షేర్ ను వెన్నెల కిశోర్ పంచుకోబోతున్నాడు. ఈ మూవీతో పాటు మరో రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. వీటిలో ఒక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తోంది.

ఆ మధ్య బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ హీరోగా స్వాతిముత్యం అనే చిత్రం రూపొందించిన లక్ష్మణ్ కే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీకే ‘ఐటెమ్’ అనే టైటిల్ పెట్టబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీ విష్ణుకు ఉన్న ఇమేజ్ తో చూస్తే ఈ ఐటెమ్ అనే టైటిల్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.

Tags

Next Story