Sreeja Konidela: ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన శ్రీజ.. 'వదిలేసి వెళ్లినందుకు థ్యాంక్స్' అంటూ కామెంట్..

Sreeja Konidela: ప్రస్తుతం సినీ పరిశ్రమలో విడాకుల విషయం ట్రెండింగ్ అవుతుండడంతో ఏ ఇద్దరి సెలబ్రిటీల ప్రవర్తనలో మార్పు వచ్చినా అది విడాకులకు సంకేతమే అని ఫిక్స్ అయిపోతున్నారు ప్రేక్షకులు. అలాగే తాజాగా చిరంజీవి కూతురు శ్రీజ కళ్యాణ్ విడాకుల గురించి చర్చ వైరల్‌గా మారింది. ఆమె పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు కూడా ఈ రూమర్స్ అన్ని నిజమేనేమో అనిపించేలా చేస్తున్నాయి.
విడాకులు తీసుకోవాలన్న ఆలోచన రాగానే ముందుగా దానిని ఇన్‌డైరెక్ట్‌గా సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నారు సెలబ్రిటీలు. అలాగే ఇటీవల చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కళ్యాణ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పేరు శ్రీజ కళ్యాణ్ నుండి శ్రీజ కొణిదెలగా మార్చేసింది. దీంతో తాను భర్తతో విడిపోనుంది అన్న రూమర్స్ మొదలయ్యాయి.
శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను మార్చినప్పటి నుండి భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేయడం ఆపేసింది. ఇవి రూమర్స్‌కు మరింత ప్రాణం పోశాయి. ఇటీవల అన్నయ్య రామ్ చరణ్‌తో కలిసి హాలీడేకు ముంబాయ్‌కు వెళ్లింది శ్రీజ. హాలీడేకు ఇద్దరే ఎందుకు వెళ్లారు అని అందరూ కన్ఫ్యూజన్‌లో ఉన్న సమయంలోనే శ్రీజ ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది.
'హగ్స్.. ఇవే నేను ఇంకా సంతోషంగా బ్రతికుతున్నందుకు కారణాలు' అని అన్నయ్య రామ్ చరణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేసింది శ్రీజ. ఈ క్యాప్షన్ చూస్తుంటే శ్రీజ కాస్త ఎమోషనల్ అయినట్టుగానే కనిపిస్తోంది. దీనికి చాలావరకు మెగా ఫ్యామిలీ స్పందించింది. అందులో భాగంగానే తన అక్క సుస్మిత కొణిదెల 'నన్ను వదిలేసి వెళ్లిపోయినందుకు థాంక్స్' అంటూ కామెంట్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com