Sreeleela : ప్రోమోతోనే ఇంత హైలెట్ చేస్తున్నారే

ధమాకా బ్యూటీ శ్రీ లీల అంటే ఎనర్జీకి మారుపేరు అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా తను వేసే స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి సందడితో తెలుగు తెరకు పరిచయం అయినా.. రవితేజ సరసన నటించిన ధమాకాతో గుర్తింపు తెచ్చుకుంది.ధమాకాలో రవితేజ ఎనర్జీని దాటిపోయి అందరినీ ఆకట్టుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అమ్మడికి ఆఫర్స్ వెల్లువెత్తాయి. కాకపోతే వాటిలో పోయిన సినిమాలే ఎక్కువ. రీసెంట్ గా వచ్చిన రాబిన్ హుడ్ డిజాస్టర్ అనిపించుకుంది. ప్రస్తుతం తనకు తెలుగులో మరోసారి రవితేజతో నటిస్తోన్న మాస్ జాతర మూవీ మాత్రమే ఉంది. అటు బాలీవుడ లో డెబ్యూ ఇచ్చేస్తోంది.
ఇక లేటెస్ట్ గా మాస్ జాతర మూవీ నుంచి ఓ సాంగ్ విడుదల చేయబోతున్నాం అనే అనౌన్స్ మెంట్ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో శ్రీ లీల కంటే రవితేజనే ఎక్కువ కనిపించాడు. అయినా హాట్ టాపిక్ గా మారింది మాత్రం శ్రీ లీలనే. ఏకంగా ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసిందీ బ్యూటీ. ఎక్కడ చూసినా తన ఫోటోలో దర్శనం ఇస్తున్నాయి. చాలా అంటే చాలా ట్విట్టర్ హ్యాండిల్స్ తో తన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. మరి ప్రోమోకే ఇలా ఉంటే పాటతో ట్విట్టర్ ను హీటెక్కించేస్తుందేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com