Sreeleela : పవన్ కళ్యాణ్ సమక్షంలో శ్రీ లీల బర్త్ డే సెలబ్రేషన్స్

టాలెంటెడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల బర్త్ డే వేడుకలను పవన్ కళ్యాణ్ సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్ తో ఒక విషయం తేలిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడని. యస్.. ఆ మూవీ సెట్స్ లోనే శ్రీ లీల బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ తో పాటు మూవీ టీమ్ కనిపిస్తోంది. ఈ ఫోటోలో పవన్ పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు.
విశేషం ఏంటంటే.. శ్రీ లీల బర్త్ డే ఈ నెల 14న. అయినా వీళ్లు ఆలస్యంగా కేక్ కట్ చేయించారు. అందుకు కారణం అమ్మడు ఇప్పుడే ఈ షూటింగ్ లోకి అడుగుపెట్టిందన్నమాట. ఓ రకంగా బిలేటెడ్ బర్త్ కేక్ కటింగ్ అనుకోవచ్చు. ఆ రోజు మూవీ నుంచి ఒక స్టిల్ విడుదల చేశారు. ఇప్పుడు కేక్ కట్ చేయించారు. మొత్తంగా ఈ స్టిల్ పవన్ తన పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నాడనేందకు నిదర్శనంగానూ కనిపిస్తోంది.
ఇక ఈ మూవీ తమిళ్ లో వచ్చిన తెరి (తెలుగులో పోలీసోడుగా డబ్ అయింది) చిత్రానికి రీమేక్ అని చెప్పారు. అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు పవన్ డిప్యూటీ సిఎమ్ కాదు. అందుకే ఈ మధ్యే స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేయించాడు. పైగా పవన్ స్వయంగా కొన్ని ఇన్ పుట్స్ కూడా ఇచ్చాడట దర్శకుడికి. ఆ మేరకు అన్ని మార్పులు చేసిన తర్వాతే పవన్ సెట్స్ లో అడుగుపెట్టాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు పూర్తయింది. ఓ.జికి సంబంధించి చాలా కొద్ది రోజులు మాత్రమే షూట్ చేయాల్సి ఉంది. ఇక ఉస్తాద్ కూడా ఫినిష్ చేస్తే పాత సినిమాలన్నీ కొత్తగా వచ్చేస్తాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com