Sreeleela: శ్రీలీల తండ్రి బడా వ్యాపారవేత్త.. ఆయన మాత్రం నా కూతురు కాదంటూ..

Sreeleela (tv5news.in)
Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్‌లో కన్నడ బ్యూటీల హవా నడుస్తోంది. తాజాగా మరో కన్నడ అమ్మాయి కూడా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అందరినీ ఇంప్రెస్ చేసేస్తోంది. తనే శ్రీలీల. తెలుగులో తన మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో చేసే అవకాశం కొట్టేసిన శ్రీలీల ఇప్పటికే చాలామంది అబ్బాయిల క్రష్ లిస్ట్‌లోకి యాడ్ అయిపోయింది. అయితే.. తన పర్సనల్ లైఫ్ గురించి, తన తండ్రి గురించి పెద్ద కాంట్రవర్సీనే నడుస్తోంది.
శ్రీలీల ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు కూతురని గతకొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్ని రోజులు దీనిపై మౌనంగా ఉన్న శుభాకరరావు ఇటీవల ఈ విషయంపై స్పందించారు. తన ఆస్తి కోసమే వారు ఇంటర్వ్యూలలో ఇలా ప్రచారం చేస్తు్న్నారని శుభాకరరావు ఆరోపించారు. శ్రీలీల అసలు తన కూతురే కాదని తేల్చి చెప్పారు.
శ్రీలీల తన కూతురు కాదని, తన మాజీ భార్య కూతురని బయటపెట్టారు సూరపనేని శుభాకరరావు. వారిద్దరు విడిపోయిన తర్వాత తన మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చిందని ఆయన అన్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తామని, ఇంకా వారి విడాకులపై కేసులు నడుస్తున్నాయని శుభాకరరావు చెప్పారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లామని, దీనిపై సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు తెలిపారు. ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న శ్రీలీల లైఫ్‌లో ఇలాంటి కాంట్రవర్సీ ఉండడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com