Sreeleela : శ్రీ లీల బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్

Sreeleela :  శ్రీ లీల బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్
X

ఛలాకీ బ్యూటీ శ్రీ లీల తెలుగులో సైరన్ లా దూసుకువచ్చింది. బట్ అంతే వేగంగా డౌన్ అయింది. మళ్లీ ఇప్పుడు బిజీ అవుతోంది. తమిళ్ లో కూడా శివకార్తికేయన్ సరసన పరాశక్తి అనే మూవీతో పరిచయం అవుతోంది. తెలుగులో మాస్ జాతర, రాబిన్ హుడ్ మూవీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఆ మధ్య తను బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కన్ఫార్మ్ అయ్యాయి. ఈ మధ్య వరుస విజయాలతో బాలీవుడ్ లో షైన్ అవుతోన్న కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతోంది ఈ ధమాకా పాప.

శ్రీలీల చిత్రాన్ని అనురాగ్ బసు డైరెక్ట్ చేయబోతున్నాడు. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందబోతోందట. ప్రీతమ్ సంగీతం అందిచబోతున్నాడు. అనురాగ్ బసుకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని సినిమాలకు ఇండియా అంతా క్రేజ్ ఉంటుంది. మర్డర్, గ్యాంగ్ స్టర్, లైఫ్ ఇన్ ఏ మెట్రో, బర్ఫీ వంటి మూవీస్ తో తనదైన ముద్ర వేశాడు. అలాంటి దర్శకుడితో బాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న శ్రీలీలను అంతా బెస్ట్ ఛాయిస్ అంటున్నారు. సినిమా ఎలా ఉన్నా.. అమ్మడిలోని ‘ఎక్స్ ట్రా’ టాలెంట్స్ అన్నీ ఈ మూవీతో బయటకు వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ మార్చి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల పెయిర్ కూడా ఫ్రెష్ గా ఉంటుందని బాలీవుడ్ ఆడియన్స్ కూడా కమెంట్స్ చేస్తుండటం విశేషం.

Tags

Next Story