Sreeleela : అన్నదమ్ములతో రొమాన్స్ కు రెడీ అయిన శ్రీ లీల

Sreeleela  :  అన్నదమ్ములతో రొమాన్స్ కు రెడీ అయిన శ్రీ లీల
X

ధమాకా బ్యూటీ శ్రీ లీల కెరీర్ లో ఎంత వేగంగా రైజ్ అయిందో అంతే వేగంగా డౌన్ అయింది. బట్ మళ్లీ చాలా తొందరగానే సెట్ చేసుకుంది. కొన్ని రోజుల క్రితం తన చేతిలో సినిమాలే లేవు. ఆ టైమ్ లో మరోసారి రవితేజ ఆదుకున్నాడు. తన మాస్ జాతరలో మరోసారి అవకాశం ఇచ్చాడు. ఇటు నితిన్ సరసన చేస్తోన్న రాబిన్ హుడ్ సంక్రాంతికి విడుదల కాబోతోంది. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ అలా ఉండిపోయింది. ఈ టైమ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిందీ బ్యూటీ.

విరూపాక్షతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న కార్తీక్ దండు డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న మూవీలో శ్రీ లీలనే హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి ఈ పాత్రకు ఫస్ట్ మీనాక్షి చౌదరిని అనుకున్నారు. ఆ ప్లేస్ లోకి లేటెస్ట్ గా శ్రీ లీలను తీసుకున్నారు. ఇది ఓ రకంగా పెద్ద ఆఫర్ అనే చెప్పాలి. దీంతో పాటు తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చిందీ బ్యూటీకి. అది కూడా నాగ చైతన్య తమ్ముడు అఖిల్ సరసన. అఖిల్ హీరోగా సితార, అన్నపూర్ణ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న భారీ బడ్జెట్ మూవీలో శ్రీ లీలను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అలా ఒకేసారి అన్నదమ్ములిద్దరితో రొమాన్స్ చేసే ఛాన్స్ అందుకుంది శ్రీ లీల. సో.. ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండానే తన చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. వీటిలో ఏ రెండు బ్లాక్ బస్టర్ అయినా అమ్మడి కెరీర్ మళ్లీ తారాజువ్వలా మారుతుంది.

Tags

Next Story