Sreeleela : ఓవర్ నైట్ స్టార్.. ఒక్క సినిమాతోనే రెమ్యునరేషన్ పెంచేసింది..

Sreeleela : ఓవర్ నైట్ స్టార్.. ఒక్క సినిమాతోనే రెమ్యునరేషన్ పెంచేసింది..
Sreeleela : దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుంటున్నారు ఇప్పటి తారలు. క్రేజ్, అందం ఉన్నప్పుడే.. బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ చేసుకుంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు.

Sreeleela: దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుంటున్నారు ఇప్పటి తారలు. క్రేజ్, అందం ఉన్నప్పుడే.. బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ చేసుకుంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేసి ఓవర్ నైట్‌ స్టార్ అయిపోయిందీ బ్యూటీ. తన చలాకీ తనంతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తాను నటించిన ఒక్క మూవీ హిట్ కావడంతో.. అమ్మడి స్పీడ్ చూసి వరుసగా వస్తున్నాయి ఆఫర్స్.


అలా వస్తోన్న వాటిలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. దీంతో క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్‌ చేసుకోవాలన్న ఇండస్ట్రీ థియరీని ఫాలో అవుతూ ఇంకా రెండో సినిమా కూడా రిలీజ్ కాకుండానే కోటి రూపాయలు డిమాండ్ చేస్తోంది. మరి ఇంత దూకుడుగా కోటిని కోరుకుంటోన్న ఆ కుర్రబ్యూటీ ఎవరో.. ఊహించగలరా..? గెస్ చేయండి..


పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీలీల. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈముద్దుగుమ్మ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతోంది. ఈ హీరోయిన్ మీద దర్శక నిర్మాతలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసులని దోచుకుని.. తన అందం, అభినయంతో క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.



ఈ నేపథ్యంలోనే రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. మొదటి సినిమాకి 30 నుంచి 50 లక్షల మధ్యలో వసూలు చేస్తే..ఇప్పుడు ఏకంగా కోటి డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినబడుతోంది. రీసెంట్ గా రవితేజ, వైష్ణవ్ తేజ్ వంటి వారితో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు నవీన్ పొలిశెట్టి సినిమాలో నటించే అవకాశం కూడా శ్రీలీలను వరించింది.

Tags

Read MoreRead Less
Next Story