మెగాస్టార్ ఆఫర్ కు నో చెప్పిన శ్రీ లీల

ధమాకా తర్వాత ఒక్కసారిగా రైజ్ అయిన బ్యూటీ శ్రీలీల. ఎంత వేగంగా రైజ్ అయిందో అంతే వేగంగా డౌన్ అయింది. తను చేసిన సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో పాపం అవన్నీ తన అకౌంట్ లోకి పడిపోయాయి. ఆయా హీరోలు బానే ఉన్నా.. అంతా తననే అనేస్తున్నారు. ఇది హీరోయిన్లకు ఓ రకంగా శాపం. హిట్ అయితే హీరో అకౌంట్ లోకి.. పోతే హీరోయిన్ల వల్లే అంటూ వారిని ఐరన్ లెగ్స్ అనేస్తుంటారు. బట్ ఒక్క బ్లాక్ బస్టర్ పడితే మళ్లీ రైజ్ అవడం పెద్ద కష్టం కాదు. కానీ దాని కోసం ఎదురుచూడాలి. ప్రస్తుతం ఆ ఎదురుచూపుల్లోనే ఉంది శ్రీ లీల.
ఆ మధ్య ఓ హిందీ సినిమాకు కమిట్ అయింది. అదో చిన్న సినిమా. రీసెంట్ గా ఓ పెద్ద హీరో సరసన ఆఫర్ వచ్చిందనే న్యూస్ వచ్చాయి. బట్ కన్ఫార్మ్ చేయలేదు. ఈ టైమ్ లో అమ్మడు ఓ మెగా ఆఫర్ ను వదులుకుంది. అయితే తన ఒపీనియన్ గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్లకు ఈ ఆఫర్ వదులుకోవడం పై పెద్దగా ఆశ్చర్యాలేం ఉండవు. ఎందుకంటే ఈ మెగా ఆఫర్ ఓ ఐటమ్ సాంగ్.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా విశ్వంభర. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట. దాని కోసం భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తూ శ్రీ లీలను సంప్రదించారు. బట్ అమ్మడు గతంలోనే తను ఐటమ్ సాంగ్స్ చేయను అని ఖచ్చితంగా చెప్పి ఉంది. అందుకే ఈ మెగా ఆఫర్ కు నో చెప్పేసిందట. ఈ సినిమా రకరకాల లోకాల చుట్టూ తిరుగుతుందని చెప్పారు. అందువల్ల ఏదో లోకంలోని దేవ కన్యలా ఈ పాత్ర, పాట ఉంటాయట. అందుకే శ్రీ లీల అయితే బావుంటుంది.. డ్యాన్స్ లు కూడా ఇరగదీస్తుంది కదా అని అడిగితే తను చేయను అని చెప్పేసిందంటున్నారు టాలీవుడ్ లో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com