Sreeleela : శ్రీ లీలకు భలే స్టార్టింగ్ దొరికిందిగా

Sreeleela :  శ్రీ లీలకు భలే స్టార్టింగ్ దొరికిందిగా
X

ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా పిఆర్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎక్కడికి వెళ్లినా దాని గురించి సోషల్ మీడియా అంతా వారి గురించి మాట్లాడుకోవాలి. ఇందుకోసం ఫేక్ థింగ్స్ కూడా ప్లాన్ చేస్తుంటారు. కొందరు స్టార్ హీరోలైతే తాము బయట కూడా పెద్ద తోపులం అని జనాలకు కనిపించేలా ప్లాన్ చేసి మరీ ప్రమోషన్స్ చేయించుకుంటుంటారు. ఇందుకోసం భారీగా ఖర్చుపెట్టి మరీ పీఆర్ టీమ్స్ ను మెయిన్టేన్ చేస్తుంటారు. ఏం చేసినా టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యేలా ఉండాలంతే. అదే వారి మోటివ్. అయితే ఇలాంటివేం లేకుండానే అరంగేట్రంతోనే టాక్ ఆఫ్ ద టౌన్ అయింది శ్రీ లీల.

తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ధమాకా బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘తూ మేరీ మై తేరా, మై తేరా తు మేరీ’ అనే మూవీలో కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. అయితే బాలీవుడ్ లో హీరోయిన్లను ఎక్కువగా ఫేమ్ లో ఉంచేవి రూమర్స్. ఫలానా హీరోతో ఎఫైర్ ఉంది అంటూ వినిపించే రూమర్స్ వారికి అక్కడ లైఫ్ నే ఇస్తాయి. అయితే వీరి మధ్య అసలు ఏదైనా ఉందా లేదా అనేది తెలియదు కానీ.. శ్రీ లీల బాలీవుడ్ కు వెళ్లిన దగ్గర నుంచీ కార్తీక్ తో ఎఫైర్ అంటూ న్యూస్ వస్తున్నాయి. తాజాగా కార్తీక్ వాళ్ల మదర్ తనకు కోడలుగా డాక్టర్ రావాలనుకుంటున్నా అందట. అంతే.. అంతా శ్రీ లీల కూడా డాక్టరే కదా.. అందుకే ఆమె వీరి ఎఫైర్ ను కన్ఫార్మ్ చేసిందంటున్నారు. కానీ కార్తీక్ మాత్రం మా అమ్మ అన్నది నిజంగా ప్రాక్టీస్ చేసే డాక్టర్ గురించి అన్నాడు. బట్ ఏదైతే ఏం.. బాలీవుడ్ లో ఏం చేస్తే ఫేమ్ లోనూ లైమ్ లోనూ ఉంటారో.. అది శ్రీ లీలకు ఆయాచితంగానే లభిస్తోంది. దీనికి తోడు ఫస్ట్ మూవీ హిట్ అయితే పాప అక్కడ కూడా జెండా పాతేస్తుంది.

Tags

Next Story