Sreeleela: 'పెళ్లిసందడి' బ్యూటీకి దిల్ రాజు బంపర్ ఆఫర్..

Sreeleela: పెళ్లిసందడి బ్యూటీకి దిల్ రాజు బంపర్ ఆఫర్..
Sreeleela: శ్రీలీల యాక్టింగ్‌కు, ఎక్స్‌ప్రెషన్స్‌కు చాలామంది దర్శక నిర్మాతలు ఫిదా అయిపోయారు.

Sreeleela: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమా అనగానే అందులో హీరోయిన్ చాలా అందంగా, అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. ఆ అందంతో ప్రేక్షకులందరినీ ఫిదా చేస్తుంది కూడా. అలా ఎంతోమంది ముద్దుగుమ్మలను టాలీవుడ్‌కు పరిచయం చేశారు రాఘవేంద్రరావు. తాజాగా ఆయన పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందడి' సినిమాతో పరిచయమయిన శ్రీలీల కూడా వెంటవెంటనే సినిమాలు సైన్ చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది.

శ్రీకాంత్ హీరోగా పాతికేళ్ల క్రితం విడుదలయిన సినిమా 'పెళ్లిసందడి'. అప్పటివరకు తెలుగులో ట్రయాంగిల్ లవ్ స్టోరీలతో ఎన్ని సినిమాలు వచ్చినా.. దానికి కొంచెం ఫ్యామిలీ టచ్‌ను ఇచ్చి దర్శకేంద్రుడు తెరకెక్కించిన ఈ పెళ్లిసందడి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. అందుకే దానికి సీక్వెల్‌ను తెరకెక్కించాలనుకున్నారు రాఘవేంద్ర రావు. హీరోగా మరెవరో ఎందుకు అనుకొని శ్రీకాంత్ తనయుడు రోషన్‌నే మెయిన్ లీడ్‌గా పెట్టారు. హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ శ్రీలీలను తెలుగుతెరకు పరిచయం చేశారు.


పెళ్లిసందడి సీక్వెల్ కలెక్షన్ల విషయంలోనూ, టాక్ విషయంలోనూ పరవాలేదనిపించుకుంది. కానీ హీరోయిన్ శ్రీలీలకు మాత్రం ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో తన యాక్టింగ్‌కు, ఎక్స్‌ప్రెషన్స్‌కు చాలామంది దర్శక నిర్మాతలు ఫిదా అయిపోయారు. అందుకే తనకు ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రెండు సినిమాలు సైన్ చేసిన శ్రీలీల వాటిలో యంగ్ హీరోలతో జోడీకట్టడానికి సిద్ధమవుతోంది.


ముందుగా శ్రీలీల.. రవితేజ సరసన 'ధమాకా' చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. అంతే కాకుండా నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న 'అనగనగా ఒక రాజు'లో కూడా శ్రీలీలే హీరోయిన్. వైష్ణవ్ తేజ్ తరువాతి చిత్రంలో కూడా లీడ్ రోల్ కోసం శ్రీలీలను సంప్రదించినట్టు సమాచారం.


అంతే కాకుండా ఇటీవల హీరోగా పరిచయమయిన దిల్ రాజు వారసుడు ఆశిష్ తరువాతి సినిమా 'సెల్ఫిష్'లో కూడా శ్రీలీలనే హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే 'రౌడీ బాయ్స్' చిత్రంతో డెబ్యూలోనే హిట్ కొట్టిన ఆశిష్ తరువాతి సినిమాపై చాలా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దిల్ రాజు. అందులో భాగంగానే శ్రీలీలను హీరోయిన్‌గా సెలక్ట్ చేసినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story