Sreeleela: చేసింది ఒక్క సినిమానే.. అప్పుడే బ్రేకా..?

Sreeleela (tv5news.in)
Sreeleela: టాలీవుడ్‌లో ప్రస్తుతం కన్నడ బ్యూటీల హవా నడుస్తోంది. ఎప్పుడో వచ్చిన హీరోయిన్‌లు మాత్రమే కాదు.. ఇప్పుడిప్పుడే కెరీర్‌ను ప్రారంభిస్తున్న కన్నడ బ్యూటీలు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు కొట్టేసి బిజీ అవుతున్నారు. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్‌లకు గట్టి పోటీని ఇచ్చేస్తూ దూసుకుపోతున్నారు యంగ్ బ్యూటీస్. అందులో ఒకరే శ్రీలీల.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణతో తెరకెక్కిన 'పెళ్లిసందడి' సినిమాతో తెలుగులోకి వచ్చింది శ్రీలీల. అంతకు ముందే ఒకట్రెండు కన్నడ చిత్రాల్లో నటించి శాండిల్‌వుడ్‌లో కూడా పరవాలేదనిపించింది. అయితే పలు సినిమాలు చేసినా.. కన్నడలో తనకు రాని పేరు, పాపులారిటీ.. ఒక్క తెలుగు సినిమాతోనే వచ్చేశాయి.
పెళ్లిసందడిలో తన క్యూట్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్న తర్వాత పలు బడా నిర్మాత సంస్థల నుండి ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ శ్రీలీల ఇలా కెరీర్ ప్రారంభించగానే అలా బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉందట. డాక్టర్ అవ్వాలనుకొని యాక్టర్ అయ్యింది శ్రీలీల. శాండిల్‌వుడ్‌లో హీరోయిన్‌గా సినిమా చేసిన తర్వాత మరికొన్న ఆఫర్లు రావడంతో నటిగానే గుర్తింపు తెచ్చుకుంది.
అందుకే కొంతకాలం సినిమాలను పక్కన పెట్టి తన చదువుపైన దృష్టి పెట్టాలనుకుంటుదట శ్రీలీల. ఎమ్‌బీబీఎస్ పూర్తి చేసిన తర్వాత మళ్లీ సినిమావైపు అడుగులేయనుందని టాక్. ఇప్పటికే సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ఇటు యాక్టర్లుగా సక్సెస్ అవుతూనే డాక్టర్లగా కూడా తమ కెరీర్‌ను ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అదే తోవలో శ్రీలీల కూడా ప్రయాణిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com