Sreeleela : సిద్ధార్థ మల్హోత్రాతో శ్రీలీల

Sreeleela : సిద్ధార్థ మల్హోత్రాతో శ్రీలీల
X

ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్లో సందడి చేయబోతోంది. అందం, ప్రతిభ, అన్నింటికీ మించి డ్యాన్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ. నేటితరంలో సాయి పల్లవి తర్వాత మళ్లీ అంతటి ఎనర్జీ ఉన్న డ్యాన్సింగ్ క్వీన్ అని నిరూపించింది. శ్రీకాంత్ నటవార సుడు రోషన్ సరసన ఆరంగేట్రం చేసిన ఈ బ్యూటీ గుంటూరు కారంతో ఇంకా ఫేమస్ అయిపోయింది. ఏడాదికి నాలుగైదు సినిమాలకు సంతకాలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. త్వ రలోనే మాస్ మహారాజా రవితేజతో ల్యాండ్ మార్క్ 75వ మూవీలో నటించ నుంది. దీంతో పాటు బాలీవుడ్లో సత్తా చాటేందుకు శ్రీలీల గేమ్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇటీవల వరుణ్ ధావన్ సరసన నటించేందుకు అవకాశం వచ్చిందని, కానీ శ్రీలీల ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించింద ని కథనాలొచ్చాయి. ఆ తర్వాత మరో ట్యాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న భారీ క్రేజీ చిత్రంలో శ్రీలీలను ఆఫర్ వరించింది. ఈ సినిమా టైటిల్ 'మిట్టి'. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలగలిసిన ఈ చిత్రానికి బల్వీందర్ సింగ్ దర్శకుడు. అపరాధ భావనతో జీవించే యువకుడి మనోభావాలకు అద్దం పడుతూ ఎమోషనల్ టర్న్ తీసుకునే అద్భు తమైన కథను బల్వీందర్ ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఇందులో సిద్ధార్థ్ సీరియస్ ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తాడు. భారీ యాక్షన్ కి స్కోప్ ఉంది. హిందీ మీడియా కథనం ప్రకారం.. స్క్రిప్ట్ ను, తన పాత్ర గురించి విన్న వెంటనే శ్రీలీల ఆమోదముద్ర వేసింది. మిట్టి అక్టోబర్లో సెట్స్పైకి వెళ్లనుంది.

Tags

Next Story