Sreemukhi: ప్రేమలో శ్రీముఖి.. వాలెంటైన్స్ డే పోస్ట్‌తో రిలేషన్‌షిప్ గురించి చెప్పేసిందిగా..!

Sreemukhi (tv5news.in)
Sreemukhi: ఇటీవల చాలామంది యంగ్ నటీనటులు, యాంకర్స్ ట్రూ లవ్ కోసం ఎదురుచూస్తున్నారు. అందులో కూడా చాలావరకు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. అలా పెళ్లి కావాల్సిన యాంకర్స్ తెలుగు బుల్లితెరపై చాలామందే ఉన్నారు. అందులో ఒకరు శ్రీముఖి. అయితే ఈ భామ ఇకపై సింగిల్ కాదని అరర్థమవుతోంది. తాను ప్రేమలో పడినట్టు హింట్ ఇచ్చేస్తోంది.
వాలెంటైన్స్ డే అంటే చాలామంది తమరు ప్రేమించిన వాళ్లతో సరదాగా సమయాన్ని గడపాలనుకుంటారు. అంతే కాకుండా వారి వాలెంటైన్స్ అనుభవాలను అభిమానులతో పంచుకోవాలి అనుకుంటారు. అలా సోషల్ మీడియా అంతా చాలా ప్రేమతో నిండిపోతుంది. అయితే శ్రీముఖి కూడా వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌లో ఉన్న విషయం చూసిన తర్వాత ఫాలోవర్స్ ఆశ్చర్యపోతున్నారు.
లేడీ యాంకర్స్‌లో శ్రీముఖికి ఉన్న క్రేజే వేరు. అందులోనూ తన అల్లరిని, మాటలను ఇష్టపడేవారు చాలామందే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను హోస్ట్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ భామ.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీముఖి 'ఫిబ్రవరి 14, 2022.. ఇది గుర్తుపెట్టుకోండి.. మళ్లీ మాట్లాడుదాం' అంటూ ఒక బొకేతో ఉన్న తన ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో శ్రీముఖి రిలేషన్‌లో ఉందని, త్వరలోనే తన బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.
Feb 14th 2022! 🧿❤️🥰
— SreeMukhi (@MukhiSree) February 14, 2022
Idhi gurthupettukondi! Malli matladkundam! ❤️🧿
Best Valentine's ever! 🧿🧿🧿🧿
🥰🥰🥰🥰🥰🥰🥰🥰#bestvalentineever #irreplaceable #cloud9 #happiest #sreemukhi pic.twitter.com/Ty0DX7qKvl
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com