Sreemukhi: శ్రీముఖికి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత.. హీరోయిన్‌గా..

Sreemukhi (tv5news.in)
Sreemukhi: తెలుగు తెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నా.. అందులో కొందరికి మాత్రమే చాలా గుర్తింపు లభించింది. వారిలో ఒకరు శ్రీముఖి. ప్రస్తుతం ఈ యాంకర్ అన్ని ఛానెళ్లు చుట్టేస్తూ.. బిజీగా మారిపోయింది. యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా శ్రీముఖి పలు సినిమాల్లో మెరిసింది. అయితే తాజాగా తాను హోస్ట్ చేస్తున్న ఓ షోకు వచ్చిన బాలీవుడ్ నిర్మాత తనకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తానంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

యాంకర్‌గా గుర్తింపు సాధించిన తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యింది శ్రీముఖికి. అలా రామ్ హీరోగా వచ్చిన 'నేను శైలజా' చిత్రంలో హీరోకు అక్కకు నటించి మెప్పించింది. అంతే కాకుండా నాని హీరోగా వచ్చిన 'జెంటిమెన్' చిత్రంలో కూడా ఓ కీలక పాత్ర పోషించింది. అలా తన నటనతో కూడా ఆకట్టుకుంది శ్రీముఖి.

ప్రస్తుతం పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది శ్రీముఖి. అయితే తాను వ్యాఖ్యతగా చేస్తున్న ఓ షోకు తన సినిమా 'వలిమై' ప్రమోషన్స్ కోసం వచ్చాడు నిర్మాత బోణీ కపూర్. ఆ సమయంలో తనను హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయమని శ్రీముఖి అడగగా.. తాను హీరోగా చేసిన రోజు తనకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తానంటూ కాసేపు అందరితో సరదాగా మాట్లాడారు.

© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com