Bigg Boss Season 5 Telugu: శ్రీరామచంద్ర, లహరిల పెళ్లిగోల..

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక్కసారైనా ఆ ఇంటి కెప్టెన్ అవ్వాలని లక్ష్యం ఉంటుంది. అందుకే మిగతా టాస్క్‌లలో హౌస్‌మేట్స్ ఎలా ఆడినా కెప్టెన్సీ టాస్క్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు తమ శక్తికి మించి ఆడే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు కెప్టెన్ అవ్వడం కోసం సీక్రెట్ టాస్క్‌లు కూడా ఆడాల్సి వస్తుంది. సీక్రెట్ టాస్క్ పేరుతో బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌తో చేయించే పనుల వల్ల ఇప్పటివరకు ఎన్నో సీజన్లనో అందరికీ గుర్తుండిపోయే గొడవలు కూడా జరిగాయి.
ఈ వారం అలా కెప్టెన్సీ కోసం సీక్రెట్ టాస్క్‌ను చేపట్టిన హౌస్‌మేట్ రవి. హౌస్ లో అందరూ అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి టాస్క్ లో బిజీగా ఉంటున్న సమయంలో బిగ్ బాస్ రవికి ప్రియా నెక్లెస్‌ను ఎవ్వరికీ తెలియకుండా దొంగతనం చేయాలనే సీక్రెట్ టాస్క్‌ను అప్పగించాడు. ఒకవేళ ఆ పనిని కరెక్ట్‌గా పూర్తిచేస్తే క్యాప్టన్సీ రేస్‌లో నిలవడానికి రవికి ఒక అవకాశం లభిస్తుందని బాగ్ బాస్ తెలిపాడు. దీంతో రవి ప్రియా నెక్లెస్‌ను దొంగతనం చేసి దాచిపెట్టాడు.
ఆ నెక్లెస్ గురించి ప్రియా కాసేపు వెతికినా.. మెల్లగా టాస్క్ హడావిడిలో మర్చిపోయింది. అందరూ అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి లాంటి ఫన్నీ టాస్క్‌లో ప్రేక్షకులను అలరించేలా పర్ఫార్మెన్స్ చేసారు. రెండు రోజుల పాటు సాగిన ఈ టాస్క్ శ్రీరామచంద్ర, లహరిలకు జరిగిన నిశ్చితార్థంతో ముగిసింది. ఆ సంతోషంలో అందరూ సరదాగా డ్యాన్స్ కూడా చేసారు. టాస్క్ అవ్వగానే హౌస్‌మేట్స్ కాసేపు ఆ టాస్క్‌లో జరిగిన ఫన్నీ విషయాలను గుర్తుచేసుకున్నారు. మొత్తానికి టాస్క్‌లో ప్రేక్షకులను అలరించడానికి ఎవరి ప్రయత్నం వారు చేసారు. రవి సీక్రెట్ టాస్క్ విషయం బిగ్ బాస్ ఇవ్వాళ బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com