'Ustad': రిలీజ్ డేట్ ఫిక్స్.. మరో 10 రోజుల్లో థియేటర్లోకి

Ustad: రిలీజ్ డేట్ ఫిక్స్.. మరో 10 రోజుల్లో థియేటర్లోకి

శ్రీసింహ హీరోగా ఫణిదీప్ డైరెక్షన్లో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్'. 'బలగం' ఫేమ్ కావ్యా కల్యాణ్ రామ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను రజనీ కొర్రపాటి, రాకెష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై మేకర్స్ తాజాగా ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ను రివీల్ చేశారు. ఉస్తాద్ ను ఈ నెల 12న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాంతో ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో హీరోహీరోయిన్లు దగ్గరగా వచ్చినట్టుగా ఉండగా.. పై నుంచి పేపర్స్ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. మరో 10 రోజుల్లో సూర్య, మేఘన మీ హృదయాల్లో తేలిపోతారని రాసుకువచ్చారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే రిలీజైన ట్రైలర్ ప్రేక్షాభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆకాశంలో ఎగరాలని కలలు కనే సూర్య అనే ఓ సాధారణ మధ్య తరగతి యువకుడి కథే ఈ సినిమా సారాంశంగా తెలుస్తోంది. అయితే అతను ఆ కలను ఎలా సాధిస్తారు. ఈ ప్రయాణంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి.. అతని ప్రపంచం ఏంటీ.. బైక్ తో అతనికి ఉన్న అనుబంధం ఏంటీ.. ఇంతకీ అతని ప్రేమకథ ఎలా ఉండబోతుంది.. అన్న విషయాలు మాత్రం మేకర్స్ ఇప్పటికైతే సస్పెన్స్ గా ఉంచారు. ఈ సినిమాలో శ్రీసింహ మూడు భిన్నమైన లుక్స్ లో కనిపించనున్నాడట. ఇక జోసెఫ్ డిసౌజా అనే పైలట్ పాత్రలో గౌతమ్ మీనన్ నటించారని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించగా.. ఈ మూవీకి బి. అకీవా స్వరాలు సమకూర్చారు.


Tags

Read MoreRead Less
Next Story