Sri Vishnu : విష్ణు విన్యాసం అంటున్న శ్రీ విష్ణు

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ ను యాడ్ చేసుకున్నాడు శ్రీ విష్ణు. ఈ ట్యాగ్ కు సరిపోయేలా ఉండేలానే అతను మూవీస్ ను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అలా ఈ మధ్య కాలంలో వెరైటీ కథలతో ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు మరో మూవీ కూడా రాబోతోంది. విష్ణు విన్యాసం మూవీ టైటిల్. యస్.. ఈ టైటిల్ తో మూవీ అనౌన్స్ చేశాడు శ్రీ విష్ణు. అతని చిత్రాన్ని ఈ ఫిబ్రవరిలో కూడా విడుదల చేయబోతున్నానని కూడా చెప్పేశాడు. అంటే విష్ణు విన్యాసంతో శ్రీ విష్ణు చేయబోతోన్న ఫన్ ఏంటీ అనేది తెలియాల్సి ఉందీ అంటే.. అతనో వీడియో కూడా రిలీజ్ చేశాడు. అది చూస్తే కొంత వరకు మూవీ ఎలా ఉండబోతోందనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ మూవీ బైక్ నంబర్ కోసం ఫ్యాన్సీ నంబర్ కోసం చూస్తున్నాడట అతను. ఒంగోల్ కు చెందిన కుర్రాడు అని కూడా తెలుస్తోంది. వాస్తు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అంటే తెగ ఇష్టపడతాడు మనోడు. అంతే కాదు.. ఆ యాంగిల్స్ లోనే ముందుకు వెళుతాడు అని అర్థం అయ్యేలా ఉంది. ఆ విషయాన్ని తెలియజేస్తూనే టైటిల్ అనౌన్స్ చేశాడు శ్రీ విష్ణు. నో బ్రేక్స్ జస్ట్ లాఫ్స్ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు. మొత్తంగా ఈ మూవీతో శ్రీ విష్ణు మరో వినోదాత్మక కథతో వస్తున్నాడనేది తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

