Sri Vishnu : శ్రీ విష్ణు హిట్టు కొట్టేశాడు

శ్రీ విష్ణు హీరోగా కేతిక శర్మ, ఇవన హీరోయిన్లుగా వెన్నెల కిశోర్ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించిన సినిమా ‘సింగిల్’. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూస్ కూడా బావున్నాయి. మామూలుగా చిన్న సినిమాలకు ఇలాంటి టాక్ వచ్చినా.. అవి మంచి కలెక్షన్స్ గా టర్న్ కావడం ఈ మధ్య బాగా జరుగుతోంది. అలాగే సింగిల్ కూడా టాక్ మాత్రమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ కూడా తెచ్చుకుంటూ సూపర్ హిట్ అనే దిశగా దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ 16.30 కోట్లు వసూలు చేసింది. శ్రీ విష్ణు మూవీస్ కు మూడు రోజుల్లో ఈ కలెక్షన్స్ అంటే పెద్ద విషయమే అని చెప్పాలి.
కంటెంట్ పరంగా వీక్ గా ఉన్నా.. కామెడీతో స్ట్రాంగ్ అయిందీ మూవీ. సింగిల్ లైనర్స్, పంచ్ లు బాగా పేలాయి. కొన్ని రిఫరెన్స్ లు కూడా నవ్వించాయి. అందరు హీరోలను ఇమిటేట్ చేస్తూ సాగే ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. హీరోయిన్లతో కెమిస్ట్రీ, శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్ టైమింగ్ అదిరిపోయిందనే టాక్ ఉంది. ఇండియాలోనే కాక ఓవర్శీస్ లో కూడా సింగిల్ మూవీ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుండటం విశేషం. ఇదే ఊపు కంటిన్యూ అయితే శ్రీ విష్ణుకు అక్కడ ఒన్ మిలియన్ వచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మరి ఈ సోమవారం నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేదాన్ని బట్టి మూవీ రేంజ్ ఇంకా పెరగొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com