Sri Vishnu's Single : శ్రీ విష్ణు ‘సింగిల్’ కష్టాలు

Sri Vishnus Single :  శ్రీ విష్ణు ‘సింగిల్’ కష్టాలు
X

శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా సింగిల్. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవన హీరోయిన్లు. వెన్నెల కిశోర్ మరో ‘ఫుల్ లెంగ్త్’రోల్ లో కనిపించబోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పించిన ఈ మూవీకి ఆశించిన బజ్ క్రియేట్ కాలేదు అనేది నిజం. ఆ మధ్య ట్రైలర్ లో శివయ్యా అనే డైలాగ్ కాంట్రవర్శీ అయింది. సినిమాలో తీసేశారని టాక్. అయితే ప్రమోషన్స్ పరంగా ఈ మూవీ నుంచి పెద్దగా క్రియేటివ్ కంటెంట్ అయితే కనిపించలేదు. అసలే ఇప్పుడు క్రియేటివ్ ప్రమోషన్స్ అనే ట్యాగ్ బాగా వినిపిస్తోంది కదా. అలా చూస్తే సింగిల్ గురించి సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ లో అస్సలు క్రేజ్ లేదు. అంటే ఆ ఆడియన్స్ వరకూ మూవీ ప్రమోషన్స్ వెళ్లలేదు అనే చెప్పాలి.

మరోవైపు సింగిల్ తో పాటు విడుదలవుతోన్న సమంత శుభం చిత్రం కోసం ఏకంగా రెండు మూడు రోజుల నుంచి ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. బట్ సింగిల్ విషయంలో ప్రీమియర్స్ కాదు కదా.. అసలు ఫస్ట్ డే మినిమం ఓపెనింగ్స అయినా వస్తాయా అనే డౌట్ చాలామందిలో ఉంది. ఆ డౌట్ కు కారణాలూ లేకపోలేదే. ఈ మూవీ ట్రైలర్ ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేదు. కేవలం శ్రీవిష్ణు డిఫరెంట్ డైలాగ్ డెలివరీ అని చెబుతున్నారు కానీ.. ఇలాంటివి అర్థం కాకపోవడం వల్ల బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఎన్నో ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ చూసిన ఆడియన్స్ ఈ మూవీ ట్రైలర్ లో కొత్తదనం మచ్చుకు కూడా కనిపించలేదు. మొత్తంగా సింగిల్ మూవీకి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం చాలా పెద్ద టాస్క్ లానే కనిపిస్తోంది.

Tags

Next Story