sridevi drama company latest promo: సుడిగాలి సుధీర్ నవ్విస్తూనే ఏడిపించాడు.. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లో..

sridevi drama company latest promo: కనిపెంచిన తల్లిదండ్రులు కన్నబిడ్డలకు భారమవుతున్నారు. వేలు పట్టుకుని నడిపించిన నాన్నను నిర్ధాక్షణ్యంగా వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. అమ్మ కనిపించకపోతే ఒక్క క్షణమైనా ఉండలేని చిన్నతనం.. పెద్దయ్యాక ఆమెకి కనిపించకుండా అంత దూరంలో ఉంటున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను చూడని వారు కనిపించని దైవానికి పూజలు, పునస్కారాలు చేస్తున్నారు.
బిడ్డల్ని కార్పోరేట్ స్కూల్లో చదివిస్తున్నారు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు.. రేపొద్దున్న వారి పరిస్థితి కూడా అదే అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోతున్నారు. ఇలాంటి వార్తలు ఎన్ని చదివినా, ఎన్ని విన్నా, ఎన్ని చూసినా మారని సమాజం, మారని కొడుకు, కూతుళ్లకు మరోసారి గుణపాఠం నేర్పే ప్రయత్నం చేసింది కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఓ మంచి కాన్సెప్ట్‌తో బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈసారి. విడుదలైన ప్రోమో హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.
సుడిగాలి సుధీర్ నవ్విస్తూనే ఏడిపించాడు.. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లో..వృద్ధాశ్రమంలోని తల్లితండ్రులు కొడుకులకు దూరంగా ఉంటూ అది తమ దౌర్భాగ్యమని కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. సుధీర్ వాళ్లందరినీ తీసుకొచ్చి వారి బాధల్ని, వారు పడుతున్న వేదనని పంచుకునేందుకు వేదిక కల్పించాడు. ఓ దశలో కంటెస్టెంట్లతో పాటు జడ్జిలుగా వ్యవహరించిన వాళ్లూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే వేదికపై ఉన్న యాంకర్స్ భాను, వర్షలు వృద్ధాశ్రమానికి లక్షరూపాయల చెక్కును అందజేశారు.
నటి ఇంద్రజ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌కి నెలకి హాస్పిటల్ బిల్ ఎంతవుతుందో తెలుసుకున్నారు.. లక్ష రూపాయలు అవుతుందని చెప్పింది వృద్ధాశ్రమ నిర్వాహకురాలు. ఇకపై తానే ఆ మొత్తాన్ని ప్రతినెలా అందజేస్తానని చెప్పి తన మంచి మనసును చాటుకుంది ఇంద్రజ. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పుకాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే అని వృద్దుల గాధలు విన్న ప్రతి ఒక్కరూ కంటి తడి పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com