అలా మధ్యలోనే ఆగిపోయిన రాజశేఖర్, శ్రీదేవిల వివాహం..!

అలా మధ్యలోనే ఆగిపోయిన రాజశేఖర్, శ్రీదేవిల వివాహం..!
చక్కనైనా అందం, అత్యద్భుతమైన అభినయం ఈ రెండు కలిస్తే.. అతిలోక సుందరి శ్రీదేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు..

చక్కనైనా అందం, అత్యద్భుతమైన అభినయం ఈ రెండు కలిస్తే.. అతిలోక సుందరి శ్రీదేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు.. పదహారేళ్ళ వయసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన శ్రీదేవి.. తనదైన నటనతో ఆకట్టుకొని అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో ఫుల్ స్వింగ్ లో ఉండగానే, బాలీవుడ్ లోకి అక్కడ కూడా రాణించింది. అయితే శ్రీదేవి తండ్రి, హీరో రాజశేఖర్ తండ్రి మంచి స్నేహితులు కావడంతో శ్రీదేవిని రాజశేఖర్ కి ఇచ్చి పెళ్లి చేయాలనీ భావించారట. కానీ సినిమా పరిశ్రమకి సంబంధించిన అమ్మాయిను పెళ్ళి చేసుకోకూడదని రాజశేఖర్ తల్లిగారు రాజశేఖర్ వద్ద మాట తీసుకోవడంతో శ్రీదేవి, రాజశేఖర్ మ్యారేజ్ ప్రపోజల్ మధ్యలోనే ఆగిపోయింది.

అయితే రాజశేఖర్ సినిమాల్లోకి రాకముందే ఈ మ్యారేజ్ ప్రపోజల్ రావడం విశేషం. హీరో రాజశేఖర్ సినిమాల్లోకి రావడం వాళ్ళ అమ్మగారికి పెద్దగా ఇష్టం ఉండేది కాదట. కానీ కొన్ని కండిషన్స్ కి ఒకే చెప్తేనే రాజశేఖర్ ని సినిమాల్లోకి వెళ్ళడానికి ఒప్పుకున్నారట ఆమె. అందులో సినిమాకి సంబంధించిన అమ్మాయిను పెళ్ళి చేసుకోకూడదు అనే కండిషన్ ఒకటట. దీనితో శ్రీదేవి, రాజశేఖర్ పెళ్లి మ్యాటర్ మధ్యలోనే ఆగిపోయింది. కానీ విచిత్రం ఏమిటంటే.. చివరికి హీరో రాజశేఖర్ సినిమా పరిశ్రమకి చెందిన హీరోయిన్ జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

1991లో మగాడు సినిమా షూటింగ్ లో రాజశేఖర్ కు గాయాలు అయినప్పుడు జీవిత దగ్గర ఉండి సేవలు చేసిందట.. ఇది చూసిన రాజశేఖర్ తల్లిదండ్రులు ఆయనకీ సరైనా జోడి జీవిత అని భావించి వారికి వివాహం జరిపించారట.. ఈ విషయాన్ని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story