Janhvi Kapoor : శ్రీదేవి జయంతి .. తిరుమలకు జాన్వీ

Janhvi Kapoor : శ్రీదేవి జయంతి .. తిరుమలకు జాన్వీ
X

అలనాటి నటి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె కుమార్తె జాన్వీ కపూర్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతీ ఏటా జాన్వీ ఇదే అనుసరిస్తుంటారు. ఈ సందర్భంగా తిరుపతి మెట్లు, తల్లితో తన చిన్నప్పటి ఫొటో, తాను చీరలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా. ఐ లవ్యూ’ అని దానికి క్యాప్షన్ ఇచ్చారు. తిరుపతి అన్నా, తాను చీర కట్టినా తల్లికి ఇష్టమని జాన్వి పలు సందర్భాల్లో వెల్లడించారు. హిందీలో చాన్నాళ్ల క్రితమే హీరోయిన్‪‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో 'దేవర', రామ్ చరణ్ కొత్త మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ రెండింటిపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఈ మూవీస్ హిట్ అయితే మాత్రం జాన్వీ దశ తిరిగినట్లే! ఇక శ్రీదేవి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమె అనుకోని రీతిలో ఆరేళ్ల కిందట కన్నుమూసిన విషయం తెలిసిందే.

Tags

Next Story