శ్రీదేవితో కమల్ పెళ్లి.. ఎందుకు మిస్సైంది!!

సిల్వర్ స్క్రీన్‌పై వీరిద్దరి కెమిస్ట్రీని చూసి ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉందో.. ఇద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటే భలే ఉంటుంది కదా అని అభిమానులతో శ్రీదేవి తల్లి కూడా అదే అభిప్రాయంతో ఉండేవారు. అదే విషయాన్ని ఓసారి కమల్‌ని అడిగేశారు కూడా.. మరి దానికి కమల్ ఏం సమాధానం చెప్పారో చూద్దాం..
నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శించే నటుడు కమల్ హాసన్.. అందం, అభినయం కలబోసిన తార శ్రీదేవి.. దేవలోకం నుంచి భూలోకాని దిగి వచ్చిన దేవకన్యలా ఉంటుంది శ్రీదేవి. ఆమెను ఇష్టపడని నటులు కానీ అభిమానులు కానీ ఉండరంటే అతిశయోక్తి కాదు. కమల్ హాసన్, శ్రీదేవి కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్.
శ్రీదేవికి కేవలం 13 సంవత్సరాల వయసులో 1976 లో తమిళ చిత్రం 'మూండ్రు ముడిచు' సెట్స్‌లో కమల్‌ని తొలిసారి కలిశారు. అప్పటికి కమల్ హాసన్ పెద్ద స్టార్. కమల్‌పై ఎంతో గౌరవం ఉన్న శ్రీదేవి అతన్ని 'సర్' అని సంబోధించేవారు. కమల్ కూడా ఆమెను అంతే గౌరవంగా చూసేవారు.
ఆ చిత్రం హిట్టవడంతో వీళ్లిద్దరూ కలిసి మరికొన్ని ప్రేమ కధా చిత్రాల్లో నటించారు. వాటిని కూడా ప్రేక్షకులు ఆదరించడంతో ఈ జంట హిట్ ఫెయిర్‌గా నిలిచింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీదేవి తల్లి రాజేశ్వరి.. తన కుమార్తెకు సరిజోడి కమల్ అని అనుకుంది. సందర్భం చూసుకుని కమల్ దగ్గర తన మనసులో మాటని బయటపెట్టారు. కానీ కమల్ ఆమె అభిప్రాయాన్ని సున్నితంగా తిరస్కరించారు. శ్రీదేవిని తన కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్నానని వివాహం చేసుకోలేనని కమల్ సమాధానం చెప్పారు.
అయినప్పటికీ, తాము ఒకరినొకరు ఎంతో గౌరవించుకునే వారమని శ్రీదేవి చనిపోయే వరకు తనని 'సార్' అని సంబోధించేదని కమల్.. ప్రస్తావన వచ్చిన ప్రతిసారి గుర్తు చేసుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com