Sridevi Sarees: అందాల తారకు నివాళులు.. వేలంలో 'ఇంగ్లీష్ - వింగ్లీష్' చీరలు..

Sridevi Sarees: అందాల తారకు నివాళులు.. వేలంలో ఇంగ్లీష్ - వింగ్లీష్ చీరలు..
Sridevi Sarees: కొందరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినా, వారి జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. మనసు లోతుల్లో చెరగని ముద్ర వేస్తారు. తలుచుకున్నప్పుడల్లా గుండె బరువెక్కుతుంది.

Sridevi Sarees: కొందరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినా, వారి జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. మనసు లోతుల్లో చెరగని ముద్ర వేస్తారు.తమదైన మార్కుని మిగిల్చి వెళ్లే వారి రూపం ఎన్నేళ్లైనా ఎద లోతుల్లో గుడి కట్టుకుని ఉంటుంది. అందాల తార శ్రీదేవి అందానికి, అభినయానికి ప్రతి రూపం. ఆమె నటించిన ఇంగ్లీష్, వింగ్లీష్ ఓ సాధారణ గృహిణి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పడే తాపత్రయాన్ని ప్రతిబింబిస్తుంది.

అందాల సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి దాదాపు నాలుగేళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ, ఆమె బుల్లితెరపై ఆమె సినిమాలు వచ్చినప్పుడల్లా అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటారు. తన అందం, నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 1980-90 దశకంలో ఓ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది. 1997లో నిర్మాత బోనీ కపూర్‌ని వివాహం చేసుకుంది.

వివాహం తరువాత నటనకు విరామం ఇచ్చిన శ్రీదేవి 2012లో ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించింది. ఈ సినిమాలో శ్రీదేవి నటన అందరి ప్రశంసలు అందుకుంది. శ్రీదేవికి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అక్టోబర్ 10కి విడుదలై పదేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో అతిలోక సుందరికి నివాళులు అర్పించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

అందాల తారకు నివాళులు..

ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు దర్శకురాలు గౌరీ షిండే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 10వ వార్షికోత్సవంతో పాటు ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయాలని గౌరీ భావిస్తున్నట్లు సమాచారం. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందజేయనున్నారు. అయితే ఆమె చీరలు ఎక్కడ వేలం వేయబడతాయి? ఎలా కొనుగోలు చేయాలనే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని గౌరి తెలిపారు.

అదే సమయంలో, శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ నటిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ధడక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ.. ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా, రూహి వంటి చిత్రాల ద్వారా నటిగా గుర్తింపు పొందింది. ఇటీవల విడుదలైన గుడ్‌లక్ జెర్రీ కూడా మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆమె మి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవల్ చిత్రాలతో బిజీగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story