శ్రీహరి క్యారెక్టర్.. సాయం కోరి ఇంటికి వెళితే..: ఎమోషన్ అయిన పృథ్విరాజ్

కొందరు వ్యక్తులు మరణించినా జీవించే ఉంటారు. అలాంటి వారిలో దివంగత నటుడు శ్రీహరి ఒకరు. వరుస సినిమాలు, విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా.. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగి పోయే నటుడు శ్రీహరి. కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇండస్ట్రీ ఓ మంచి నటుడ్ని కోల్పోయింది. తాజాగా ఆయన క్యారెక్టర్ గురించి ప్రముఖ కమెడియన్ పృథ్విరాజ్ ఓ షోలో కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీహరి తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు.
1987లో బ్రహ్మనాయుడు సినిమాతో చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీహరి దాదాపు పాతికేళ్ల పాటు ఎన్నో చిత్రాలు, మరెన్నో పాత్రలు.. ఆయనకు పేరుతో పాటు అవార్డులనూ తెచ్చిపెట్టాయి. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ప్రముఖ నటి, డ్యాన్సర్ డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. పాప చిన్నప్పుడే చనిపోయింది. కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీహరికి 2013లో లివర్‌కి సంబంధించిన సమస్యలతో కన్నుమూశారు. శ్రీహరి తన సుదీర్ఘ కెరీర్‌లో ఎంతో మందికి సహాయం చేశారు.
షోలో భాగంగా శ్రీహరి ఫోటో చూడగానే పృథ్విరాజ్ ఎమోషన్ అయ్యారు. రోడ్ నెం.45లో ఉన్న శ్రీహరి గారి ఇంటి ముందుకు ఎవరైనా సహాయం కోసం వెళ్తే.. రాళ్లకు డబ్బులు చుట్టి.. దానికి గుడ్డ కట్టి బయటకు విసిరేసేవాడు. వాటిని తీసుకున్న వాళ్లు ఆయనకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టేవారు. ఈ విధంగా శ్రీహరి ఏదో ఒక రూపంలో కొన్ని వేల మందికి సహాయం చేశారు అంటూ ఆయన గొప్పతనం గురించి వివరించారు పృథ్విరాజ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com