Vennela Kishore : వెన్నెల కిశోర్ మరో నవీన్ పోలిశెట్టి అవుతాడా

షెర్లాక్ హోమ్స్ తరహా మూవీస్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఫ్యామిలీ మొత్తం థియేటర్స్ కు వెళుతుందన్నమాట. తెలుగులో చంటబ్బాయ్ తర్వాత ఆ స్థాయిలో ఎంటర్టైన్ చేసిన సినిమా ఆ మధ్య వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ నెల్లూర్ ప్రాంత నేపథ్యంలో సాగుతుంది. సూపర్ హిట్ గా నిలిచింది. నవీన్ టాలెంట్ ఏంటో టాలీవుడ్ కు తెలిపింది. ఇప్పుడు ఆ తరహాలో కంప్లీట్ కామెడీ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఎంటర్టైనర్ గా వస్తోన్న మూవీ ‘శ్రీకాకుళం షెర్లాక్స్ హోమ్స్’. చంటబ్బాయ్ తాలూకా అనేది క్యాప్షన్.
‘శ్రీకాకుళం షెర్లాక్స్ హోమ్స్’లో వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటించాడు. అంటే కామెడీ ఎంతైనా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అన్నమాట. అలాగే అప్పుడెప్పుడో రవితేజ, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘నేనింతే’మూవీ హీరోయిన్ శియ గౌతమ్ పోలీస్ ఆఫీసర్ గా అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రైటర్ మోహన్ దర్శకుడు. ఈ నెల 25న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతంలో జరుగుతున్న వరుస హత్యలను ఛేదించే ప్రయత్నంలో పోలీస్ లు విఫలం అవుతారు. ఆ కేస్ ను ఛేదించే పనిని లోకల్ డిటెక్టివ్ అయిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కు అప్పజెబుతారు. మరి అతను ఆ కేస్ ను ఛేదించాడా లేదా అనేది ఈ 25న తెలుస్తుందని ట్రైలర్ లోనే చెప్పారు.
ఈ ట్రైలర్ చూడగానే చాలామందికి నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ గుర్తొచ్చింది. ఈ మూవీతో నవీన్ హీరోగా సెటిల్ అయ్యాడు. మరి వెన్నెల కిశోర్ కూడా ఈ మూవీ తర్వాత హీరోగా సెట్ అవుతాడా లేదా అనేది చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com