Chiranjeevi : చిరంజీవి కోసం చెల్లెళ్ల వేట

Chiranjeevi :  చిరంజీవి కోసం చెల్లెళ్ల వేట
X

మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా దూకుడుగానే కనిపిస్తున్నాడు. విశ్వంభర విడుదలకు రెడీ అవుతోంది. కాకపోతే ఆ మూవీ అవుట్ పుట్ అనుకున్నంత గొప్పగా రాలేదు అనే టాక్ ఉంది. కంటెంట్ పరంగా ఓకే కానీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ నాసి రకంగా ఉండటంతో మరోసారి అన్నీ చేస్తున్నారు. ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయట. మిగతా కూడా పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. విశ్వంభర పరిస్థితి ఎలా ఉన్నా..2026 సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా వస్తున్నాడు మెగాస్టార్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నాం అని ముందే ప్రకటించారు. దర్శకుడు అనిల్ కాబట్టి ఆ డేట్ లో ఎలాంటి మార్పులూ ఉండవు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

అనిల్ రావిపూడి తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా అనౌన్స్ అయింది. ఈ చిత్రానికి నాని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల .. నాని హీరోగా ద ప్యారడైజ్ అనే పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేస్తాం అని ప్రకటించారు. అదే డేట్ కు రామ్ చరణ్ పెద్ది కూడా ఉండటం ఉండటం విశేషం. సో.. ఇటు శ్రీకాంత్ ప్యారడైజ్, చిరంజీవి .. అనిల్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ కాంబోలో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ కంటే సిస్టర్ పాత్రకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందట. అందుకే ఆ పాత్ర కోసం సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్ ల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసుకోవాలనుకుంటున్నారు.

గతంలో భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా సాయి పల్లవిని సంప్రదించారు. కానీ తను ఆ పాత్ర చేయను అని చెప్పింది. దీంతో కీర్తి సురేష్ ను తీసుకున్నారు. మరి ఇప్పుడు మళ్లీ సిస్టర్ అంటే ఒప్పుకుంటుందా అనేది పక్కన పెడితే సాయి పల్లవి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఇక మృణాల్ ఠాకూర్ కూడా స్క్రిప్ట్ బలంగా ఉంటే తప్ప ఒప్పుకోవడం లేదు. మరి తను ఓకే చెబుతుందా.. లేక ఇంకెవరినైనా తీసుకుంటారా అనేది చూడాలి. అయితే శ్రీకాంత్ ఓ వైపు ప్యారడైజ్ పూర్తి చేస్తూనే.. చిరంజీవి కోసం చెల్లెళ్ల వేట సాగిస్తున్నాడు.

Tags

Next Story