సినిమా

Roshan : శ్రీకాంత్ కొడుకుతో బడా నిర్మాతలు.. ఇక తగ్గేదేలే..!

Roshan : ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్‌‌ని క్రియేట్ చేసుకున్నారు హీరో శ్రీకాంత్.. ఇప్పుడు ఆయన కుమారుడు రోషన్ హీరోగా ఎదుగుతున్నాడు.

Roshan : శ్రీకాంత్ కొడుకుతో బడా నిర్మాతలు.. ఇక తగ్గేదేలే..!
X

Roshan : ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్‌‌ని క్రియేట్ చేసుకున్నారు హీరో శ్రీకాంత్.. ఇప్పుడు ఆయన కుమారుడు రోషన్ హీరోగా ఎదుగుతున్నాడు. నిర్మల కాన్వెంట్‌ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రోషన్‌. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తన తండ్రి నటించిన పెళ్లిసందడి అనే టైటిల్‌తో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ఈ సినిమాలో రోషన్ నటనకి మంచి మార్కులే పడ్డాయి.

ఈ సినిమా తర్వాత రోషన్ ఆచితూచి కథలు ఎంచుకుంటున్నాడు. అతనితో సినిమాలు చేసేందుకు కూడా బడా నిర్మాతలు ముందుకొస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ఓ సినిమాని చేసేందుకు రోషన్ కమిట్ అయ్యాడని తెలుస్తోంది. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడని సమాచారం.

ఇక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లోనూ ఓ చిత్రాన్ని చేయడానికి రోషన్‌ సైన్‌ చేసినట్లు ఫిలింనగర్ లో టాక్..ఈ రెండు సినిమాలకి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Next Story

RELATED STORIES