సెట్ లో ఎవరూ లేకపోతే శ్రీలీల అనిల్ రావిపూడిని..

కన్నడ అమ్మాయి అయినా తెలుగు వారి అభిమానాన్ని చూరగొంది. వరుస ఆఫర్లు అందుకుంటోంది. అప్పుడే ఇండస్ట్రీలో శ్రీలీలది గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. తాజాగా బాలకృష్ణ నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా నటించింది.
మొట్టమొదటి సారిగా అనిల్ రావిపూడి తనకు, శ్రీలీలకు ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు. అనిల్ స్వగ్రామం, శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణ స్వస్థలం ఒకటే.. అదే ఒంగోలు సమీపంలోని పొంగులూరు. డాక్టర్ స్వర్ణ తనకు అక్క వరుస అవుతుందని తెలిపారు. ఆ విధంగా శ్రీలల తనకు మేనకోడలు అవుతుందని అన్నారు. అందుకే శ్రీలీల సెట్లో ఎవరైనా ఉంటే డైరెక్టర్ గారు అని మర్యాదగా పిలిస్తే, ఎవరూ లేనప్పుడు మాత్రం మామయ్య అంటూ ఆట పట్టిస్తుందట. దసరా కానుకగా భగవంత్ కేసరి అక్టోబర్ 19న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. నటి కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com