స్క్రిప్ట్స్ కాదు శ్రీనూ.. హిట్స్ కావాలి..

స్క్రిప్ట్స్ కాదు శ్రీనూ.. హిట్స్ కావాలి..
శ్రీను వైట్ల నుంచి ఓ సినిమా వస్తుందంటే మాగ్జిమం గ్యారెంటీ అనుకున్నారు. హీరో ఎంత పెద్ద స్టార్ అయినా అతని తరహా కథనంలోకి ఒదిగిపోవాల్సిందే అన్నట్టుగా ఉండేవి అతని సినిమాలు.

ఒకప్పుడు హిలేరియస్ ఎంటర్టైనర్స్‌తో సూపర్ హిట్స్ అందుకున్నాడు దర్శకుడు శ్రీను వైట్ల. కానీ కాలం మారుతున్నా అతని కథలు మారలేదు. దీంతో ఓ దశలో రొటీన్ అయిపోయి.. ఆ తర్వాత మొనాటనీ అనిపించడం మొదలైంది. అయినా అతను మారలేదు. దీంతో వరుస ఫ్లాపులతో వెనకబడ్డాడు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు డీ అంటే ఢీ అంటూ విష్ణుతో సినిమా చేస్తోన్న శ్రీను.. దీని తర్వాత మరో రెండు సినిమాలతో రాబోతున్నాడట.

స్క్రిప్ట్స్ కాదు శ్రీనూ.. హిట్స్ కావాలి..శ్రీను వైట్ల నుంచి ఓ సినిమా వస్తుందంటే మాగ్జిమం గ్యారెంటీ అనుకున్నారు. హీరో ఎంత పెద్ద స్టార్ అయినా అతని తరహా కథనంలోకి ఒదిగిపోవాల్సిందే అన్నట్టుగా ఉండేవి అతని సినిమాలు. ఫస్ట్ హాఫ్ ఒకలా.. సెకండ్ హాఫ్ అంతా ఒకేలా ఉన్నా.. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో అదరగొట్టేవాడు. మెగాస్టార్ తో పాటు నాగ్, వెంకీ కూడా అతని డైరెక్షన్ లో నటించాలని ఉవ్విళ్లూరేవారంటే అతని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే అతని క్యాంప్ నుంచి రచయితలు వెళ్లిపోయారో అప్పటి నుంచి డల్ అయ్యాడు. వరుసగా ఫ్లాపులు వచ్చాయి.

శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన నాలుగు సినిమాలు వరుసగా ఒకదాన్ని మించి మరోటి ఫ్లాప్స్ మూటగట్టుకున్నాయి. దీంతో ఒకప్పుడు తను బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోలు కూడా అతని వైపు చూడ్డం మానేశారు. మొత్తంగా చాలా గ్యాప్ తర్వాత తను సూపర్ హిట్ ఇచ్చిన విష్ణు ఓకే చెప్పాడు. వీరి కాంబోలో వచ్చిన ఢీ ని గుర్తుకు తెచ్చేలా ఈ సారి ఢీ అంటే ఢీ అంటూ రాబోతున్నారు. అయితే ఇది ఢీ చిత్రానికి సీక్వెల్ కాదంటున్నాడు శ్రీను. కాకపోతే కాస్త ఆ సినిమాను గుర్తుకు తెచ్చే సన్నివేశాలు కొన్ని ఉంటాయట.

ఢీ అంటే ఢీ తర్వాత డబుల్స్ అనే టైటిల్ తో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడట శ్రీను వైట్ల. ఈ కథ ఎప్పుడో సిద్ధం చేసుకున్నదే అని టాక్. అలాగే మరో హిలేరియస్ ఎంటర్టైనర్ కథ కూడా సిద్ధం చేసుకున్నాడట. అంటే బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు రెడీగా ఉన్నాయంటున్నాడు. బట్.. ఈ రెండూ లైన్లోకి రావాలంటే ముందు ఢీ అంటే ఢీ హిట్ కావాలి. అప్పుడే నిర్మాతలు మళ్లీ ధైర్యం చేసి శ్రీను వైట్లతో సినిమాకు సిద్ధం అవుతారు. సో.. మన దగ్గర స్క్రిప్ట్స్ ఉంటే సరిపోదు బాసు.. మంచి కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేని స్టోరీ లైన్ కావాలి. దాంతో హిట్ కొట్టాలి. మరి దాన్ని శ్రీను ఎంతవరకు ఆచరణలో పెడతారో. లెట్స్ వెయిట్ అండ్ సీ.

YJ Rambabu

TV5 Entertainment Editor


Tags

Next Story