Srivalli Song Pushpa: చూపే బంగారమాయెనే శ్రీవల్లి..

Srivalli Song Pushpa: చూపే బంగారమాయెనే శ్రీవల్లి..
Srivalli Song Pushpa: సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమా పాటల సందడి ఇప్పటికే మొదలయింది.

Srivalli Song Pushpa: సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమా పాటల సందడి ఇప్పటికే మొదలయింది. ఇందులో అల్లు అర్జున్ సోలో సాంగ్ దాక్కో దాక్కో మేక పాటను ఇదివరకే విడుదల చేసిన మూవీ టీమ్.. తాజాగా ఇందులో నుండి శ్రీవల్లి అనే మెలోడీని రిలీజ్ చేశారు. రష్మికపై వచ్చిన ఈ పాట ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

చూపే బంగారమాయెనే శ్రీవల్లి పాటను సిడ్ శ్రీరామ్ పాడాడు. చంద్రబోస్ రాసిన లిరిక్స్ వింటుంటే రంగస్థలంలోని ఎంత సక్కగున్నవే పాట గుర్తొస్తుంది. అల్లు అర్జున్, రష్మిక పెయిర్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో ఇప్పటికే ఎన్నో ఛార్ట్‌బస్టర్స్ వచ్చాయి. అందులో పుష్ప కూడా ఒకటవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Tags

Next Story