హీట్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరిన SRK.. షారూఖ్ హెల్త్ అప్ డేట్ పంచుకున్న జూహీ చావ్లా..

మంగళవారం అర్థరాత్రి షారుఖ్ కు ఒంట్లో కొంచెం నలతగా ఉంటే, బుధవారం అహ్మదాబాద్‌లోని కెడి ఆసుపత్రికి తరలించారు.
"నిన్న రాత్రి షారూఖ్‌కు ఆరోగ్యం బాగాలేదు, కానీ ఈ రోజు సాయంత్రం అతను చాలా బాగున్నాడు," అని జుహీ చావ్లా మీడియాకు వివరించారు. ఆమె తన అభిమానులకు మరియు షారూఖ్ యొక్క IPL జట్టు KKR కి కూడా 'చక్ దే' అని అప్‌డేట్ చేసింది. మే 26, ఆదివారం చెన్నైలో జరిగే క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కు నటుడు హాజరు కానున్నారు.
"దేవుడు దయతలిస్తే, అతను త్వరలో లేచి ఫైనల్స్ కు హాజరవుతాడు. ఆటగాళ్లు ఆడేటప్పుడు జట్టును ఉత్సాహపరుస్తాడు" అని జూహీ జోడించారు.
మంగళవారం, SRHని ఓడించి KKR IPL 2024 ఫైనల్స్‌లోకి ప్రవేశించినప్పుడు షారూఖ్ ఉత్సాహంగా కనిపించాడు . ప్లేఆఫ్ మ్యాచ్ తర్వాత, నటుడు ప్రేక్షకుల వైపు చేతులు ఊపాడు. తన జట్టు విజయాన్ని జరుపుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత, SRK జట్టుతో కలిసి అహ్మదాబాద్‌లోని ITC నర్మదా హోటల్‌కు అర్థరాత్రి చేరుకున్నారు, అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది.
అయితే మరుసటి రోజు షారుఖ్ ఆసుపత్రిలో చేరారు. అతను ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో, అతని భార్య గౌరీ ఖాన్, జుహీ చావ్లా, ఆమె భర్త జే మెహతా ఆసుపత్రిలో షారుఖ్ ని కలవడానికి వెళ్లారు.
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో షారుఖ్‌తో పాటు అతని కూతురు సుహానా ఖాన్, చిన్న కొడుకు అబ్రామ్, మేనేజర్ పూజా దద్లానీ ఉన్నారు. సుహానా సన్నిహితులు అనన్య పాండే, షానయ కపూర్, నవ్య నంద మరియు అగస్త్య నంద కూడా షారూఖ్‌తో పాటు నరేంద్ర మోడీ స్టేడియం స్టాండ్స్ నుండి KKR ను ఉత్సాహపరిచారు.
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రానికి తాత్కాలికంగా 'కింగ్' అనే టైటిల్‌ను సిద్ధం చేశారు. ఇందులో సుహానా ఖాన్ కూడా నటించే అవకాశం ఉంది, కానీ ఈ విషయానికి సంబంధించి మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com