SS Rajamouli: చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన రాజమౌళి.. ఏ సినిమా అంటే..?

SS Rajamouli (tv5news.in)
SS Rajamouli: ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. దేశమంతటా 'ఆర్ఆర్ఆర్' మ్యానియా నడుస్తోంది. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. హీరోలతో పాటు రాజమౌళికి కూడా థియేటర్ల వద్ద కట్ ఔట్‌లు పెడుతున్నారు. ఇప్పటికే బాహుబలితో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో మరో మెట్టు ఎక్కినట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఈ దర్శక ధీరుడి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది.
'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్ కోసం మూవీ టీమ్ అంతా చాలా కష్టపడుతోంది. ముఖ్యంగా రాజమౌళి, ఎన్‌టీఆర్, రామ్ చరణ్.. ముగ్గురు కలిసి దేశంలోని ప్రధాన నగరాలన్నీ చుట్టేస్తూ ఆర్ఆర్ఆర్‌కు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా గురించే కాకుండా వీరి పర్సనల్ విషయాలు కూడా ఎన్నో బయటపడుతున్నాయి. అలాగే రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమా గురించి కూడా బయటపడింది.
ఇటీవల ఆర్ఆర్ఆర్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి, ఎన్‌టీఆర్‌లలో ఎవరు సీనియర్ అనే వాగ్వాదం మొదలయ్యింది. అదే సమయంలో 'నేను నీకంటే సీనియర్' అంటూ రాజమౌళి తాను నటించిన సినిమా గురించి బయటపెట్టాడు. 1983లోనే రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'పిల్లనగ్రోవి' అనే చిత్రంలో నటించాడట. కానీ ఆ సినిమా విడుదల కాకపోవడంతో తాను మళ్లీ యాక్టింగ్ వైపుకు వెళ్లలేదట.
ఇప్పటివరకు రాజమౌళి తాను డైరెక్ట్ చేసిన సినిమాల్లోని చిన్న చిన్న గెస్ట్ రోల్స్‌లో కనిపించి మెప్పించాడు. ముందుగా నితిన్ హీరోగా తాను తెరకెక్కించిన 'సై' చిత్రంలో కొన్ని సెకన్ల పాటు రాజమౌళి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బాహుబలిలో ఓ సీన్‌లో కనిపించి అలరించాడు. ఇలా గెస్ట్ రోల్స్‌లో మాత్రమే కనిపించిన రాజమౌళి.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడని తెలిసి తన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com