SS Rajamouli: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ దర్శకుడు..

SS Rajamouli: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ దర్శకుడు..
SS Rajamouli: టాలీవుడ్ లో తిరుగులేని విజయాలు అందుకున్న దర్శకుడు రాజమౌళి.. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌తో అతడి స్ఠాయి మరింత పెరిగింది.

Rajamouli: టాలీవుడ్ లో తిరుగులేని విజయాలు అందుకున్న దర్శకుడు రాజమౌళి.. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌తో అతడి స్ఠాయి మరింత పెరిగింది. అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది. లేటెస్ట్ గా ఈ గ్రేట్ ఫిల్మ్ మేకర్‌ను మరో అరుదైన అవార్డ్ వరించింది.


ప్రపంచ వ్యాప్తంగా సినిమా వారికి ఇచ్చే అవార్డులు చాలా ఉన్నాయి. అయితే క్రిటిక్స్ అవార్డ్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వీళ్లు కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కమర్షియల్ డైరెక్టర్స్ క్రిటిక్స్ ను కూడా మెప్పించడం చాలా అరుదుగా జరుగుతుంది. మన జక్కన్న ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.



ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్స్ విభాగంలో రాజమౌళి ఈ అవార్డ్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ లో కల్పితాలే అయినా కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ కే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఫిదా అయిపోయింది. అందుకే అవార్డు ఆయన్ని వరించింది.

Tags

Read MoreRead Less
Next Story