SS Thaman : గేమ్ ఛేంజర్ లో మొత్తం 7 పాటలుంటాయి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా "గేమ్ చేంజర్". ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, ఎస్.జే. సూర్య తదితర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో రామ్ చరణ్ మొట్టమొదటి సారిగా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన "జరగండి" పాట ప్రేక్షకులను విశ్వవంతం చేసింది. ఈ చిత్రంలో తాను మొత్తం ఏడు పాటలకు స్వరకల్పన చేసినట్టు చెప్పారు థమన్ . రెండో సింగిల్ ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా తెలియదు. కానీ, ఆగస్ట్ చివరి నుండి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని థమన్ వెల్లడించారు.
ఈ చిత్రం డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. "గేమ్ చేంజర్" పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్, థమన్ సంగీతం, దిల్ రాజు నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని ఒక విజయవంతమైన చిత్రంగా మార్చే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com