SSMB 28: మరో సీనియర్ నటిని రంగంలోకి దింపుతున్న త్రివిక్రమ్.. మహేశ్‌కు పిన్నిగా..
SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులతోనే మాయ చేసి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలడు. అందరినీ ఆకట్టుకునే మాటలతో ఒక చిత్రాన్ని హిట్ చేయగలడు. ప్రస్తుతం ఈ దర్శకుడు మైక్రోఫోన్ పట్టి రెండు సంవత్సరాలపైనే అవుతోంది. చివరిగా త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో కలిసి 'అల వైకుంఠపురంలో' అనే సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు మహేశ్‌తో మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా ఉండదు. వీరి కాంబోలో వచ్చినవి రెండు సినిమాలే అయినా.. ఆ రెండు ప్రేక్షకులకు ఎంతో నచ్చినవే. 'అతడు', 'ఖలేజా'ల్లో ఖలేజా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు కానీ చాలామంది మహేశ్ ఫ్యాన్స్‌కు ఇది ఇప్పటికీ ఫేవరెట్ మూవీ. ఇక 11 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ తన సినిమాలో ఒక సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. అదే టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న సీనియర్ హీరోయిన్స్‌ను మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో తెలుగులో ఫేడవుట్ అయిపోయిన స్నేహను మళ్లీ టాలీవుడ్‌కు తీసుకొచ్చాడు త్రివిక్రమ్.
స్నేహ తర్వాత కుష్బూ, నదియా, టబులాంటి వారికి కూడా తన సినిమాలతో టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యేలా చేశాడు. ఇప్పుడు మరో సీనియర్ నటి శోభనను రంగంలోకి దించనున్నాడు త్రివిక్రమ్. మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో మహేశ్‌కు పిన్నిగా శోభన నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఒకప్పటి స్టార్ హీరోలతో జతకట్టిన శోభన.. తెలుగులో కనిపించి చాలాకాలమే అయ్యింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com