SSMB 28: క్రేజీ అప్డేట్.. మహేశ్, త్రివిక్రమ్ జోడీ మరోసారి..

SSMB 28: క్రేజీ అప్డేట్.. మహేశ్, త్రివిక్రమ్ జోడీ మరోసారి..
SSMB 28: అతడు, ఖలేజా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు.. వాళ్లిద్దరూ కలిసి పని చేయడానికి.. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారి కాంబో అప్డేట్ రానే వచ్చింది.

SSMB 28: అతడు, ఖలేజా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు.. వాళ్లిద్దరూ కలిసి పని చేయడానికి.. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారి కాంబో అప్డేట్ రానే వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందంటే హీరో ఎవరని చూడకుండా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు.. మరి అందులో మహేష్ నటిస్తున్నాడని తెలిస్తే ప్రేక్షకులకు డబుల్ బొనాంజా..

తమన్ స్వరాలు, పూజాహెగ్డే కథానాయిక.. వావ్ వెయిటింగ్ చాలా కష్టం.. అయినా తప్పదు వచ్చే సమ్మర్ వరకు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని చిత్రబృందం శనివారం ఉదయం షేర్ చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఆగస్ట్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వెల్లడించింది.

ఇక ఈ చిత్రానికి సంబంధించి తెల్లవారుజాము నుంచే వర్క్ ప్రారంభించానంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ #SSMB28 పేరుతో వర్క్ జరుగుతోంది. పవర్‌ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం.. హారిక అండ్ హాసిని బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story