Sidhu Jonnalagadda : ఇట్స్ కాంప్లికేటెడ్ అంటూనే నచ్చేశారు

Sidhu Jonnalagadda :  ఇట్స్ కాంప్లికేటెడ్ అంటూనే నచ్చేశారు
X

ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది కరోనా వైరస్. ఆ పాండమిక్ కారణంగా ప్రపంచం అంతా ఇంటికే పరిమితం అయింది. ఇక ఎంటర్టైన్మెంట్ కోసం అంటూ టిక్ టాక్ లు, రీల్స్ సరికొత్త టాలెంట్ కూడా కనిపించింది. పాండమిక్ కాస్త రిలాక్స్ కాగానే ఓటిటి అనే మరో కొత్త సినిమా ప్రపంచం కూడా జనానికి పరిచయం అయింది. ఇంట్లో కూర్చుకుని ప్రపంచ సినిమాను ఆస్వాదించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఓటిటి బాగా ఎంటర్టైన్ చేసింది ఆ టైమ్ లో. దీంతో థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్న సినిమాలను కూడా అనివార్యంగా ఓటిటిలోకి వదిలారు. అలా వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ మూవీ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ముగ్గురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించే హీరో. అయినా అది కన్విన్సింగ్ గా ఉండటమే కాదు.. వినోదాత్మకంగానూ కనిపిస్తుంది. బట్ ఇలాంటి సినిమాలు థియేటర్స్ అయితే ఇంకా ఎక్కువగా ఆస్వాదిస్తారు. ఆ టైమ్ కు కుదరలేదు. అందుకే ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సారి రానా దగ్గుబాటి డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఈ చిత్రాన్ని వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న ఈ మూవీని విడుదల చేస్తున్నారు. బట్ టైటిల్ మార్చారు. కృష్ణ అండ్ హిజ్ లీలను ‘ఇట్స్ కాంప్లికేటెడ్’అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. వినగానే ఇదేంటీ కాస్త కాంప్లికేటెడ్ గా ఉందీ అనిపించినా.. అందుకు ప్రమోషనల్ వీడియో ఆకట్టుకుంది. సిద్దు జొన్నలగడ్డ సరసన శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వడ్నికత్తి హీరోయిన్లుగా నటించారు. రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. అందుకే మళ్లీ విడుదల చేస్తున్నాం అనగానే వీళ్లు అందరికీ బాగా నచ్చేశారు. సో.. వాలెంటైన్స్ డే రోజు ఒకే సినిమాలో మూడు ప్రేమకథలు చూడబోతున్నాం అన్నమాట.

Tags

Next Story